సూర్య ఎలాంటి సినిమాలు చేసినా కూడా అభిమానులు మాత్రం ఫుల్‌గా ఎగ్జైట్ అవుతుంటారు. ఎందుకంటే కమర్షియల్ సినిమాలతో పాటు భిన్నమైన కథలను ఎంచుకోవడంలో సూర్య ఆరితేరిపోయాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈ వెర్సటైల్ యాక్టర్. తాజాగా ఈయన 39వ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. దీని టైటిల్ జై భీమ్. టైటిల్ విన్నపుడే సినిమా ఎలా ఉండబోతుందో.. అందులో కథ ఎలా ఉండబోతుందో అర్థం అయిపోతుంది. జై భీమ్ అన్నపుడే వెనకబడిన వాళ్ల కోసం ఈ చిత్ర కథ సాగుతుందని తెలుస్తుంది. ఇప్పుడు విడుదలైన ఫస్ట్ లుక్ లోనూ అదే చూపించాడు సూర్య. జ్ఞానవేల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సూర్య నటిస్తున్న 39వ సినిమా ఇది.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ మధ్య వరస పరాజయాలు రావడంతో.. తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు సూర్య. కమర్షియల్ వేటలో కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలకే ఓటేస్తున్నాడు. స్టోరీ ఓరియంటెడ్ సినిమాల వైపు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆకాశం నీ హద్దురా సినిమాతో విజయం అందుకున్నాడు. ఇప్పుడు పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు సూర్య. ఈ సినిమాకు ‘ఎదర్కుం తునిందవన్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
మరోవైపు ఈయన నటిస్తున్న 39వ సినిమాకు జై భీమ్ టైటిల్ కన్ఫర్మ్ చేశారు. టైటిల్లోనే తెగల జాతులను చూపించారు. పేదల భూముల కోసం పోరాడే న్యాయవాదిగా సూర్య నటిస్తున్నట్లు అర్థమవుతుంది. 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య బంధువు జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో నటిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
RRR సినిమా విషయంలో వివాదాలు తప్పవా?
పవర్ స్టార్‌తో ఆ హీరోయిన్ నాలుగో పెళ్లి.. ఫోటో వైరల్?
రాజమౌళి ‘బజరంగీ భాయ్‌జాన్’ ఛాన్స్ ఎలా మిస్సయ్యాడంటే..?
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?
Shilpa Shetty | శిల్పా శెట్టిని కూడా అరెస్ట్ చేయబోతున్నారా.. ముంబైలో హై డ్రామా..!