బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Sep 05, 2020 , 12:00:35

పోస్టర్‌తో ఆసక్తి రేకెత్తించిన వర్మ

పోస్టర్‌తో ఆసక్తి రేకెత్తించిన వర్మ

వర్మ ఈ పేరు తెలుగు ఇండస్ట్రీలో ఓ సంచలనం. తనకంటూ ప్రత్యేక శైలి ఏర్పరచుకొని విభిన్న కథలతో వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కిస్తూ వస్తున్న వర్మ ఇటీవలి కాలంలో ఎక్కువగా బయోపిక్స్‌ లేదంటే యూత్‌ని ఆకర్షించే సినిమాలు చేస్తున్నాడు. కరోనా టైంలో అందరు దర్శకులు షూటింగ్‌లుకు దూరంగా ఉంటే మనోడు మాత్రం వరుస చిత్రాలు చేస్తూ అందరికి సవాల్‌ విసురుతున్నాడు.

భారతదేశంలో భయంకరమైన హత్యలలో దిశా హత్య ఒకటి. మద్యం మత్తులో నలుగురు యువకులు అమ్మాయిపై అత్యాచారం చేయడంతో పాటు దారుణంగా చంపేయడం అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనపై వర్మ .. దిశా ఎన్ కౌంటర్ పేరుతో సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా  ఫస్ట్‌ లుక్‌ విడుదల చేసి అందరి అటెన్షన్‌ను తన వైపుకు తిప్పుకున్నాడు. పోస్టర్ సినీ ప్రియులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇందులో లారీ, బైక్‌తో పాటు అత్యాచారం చేసిన వారిని షూట్ చేస్తున్నట్టు గన్ చూపించాడు. ఈ సినిమాతో వర్మ ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.


logo