ముంబై : టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఈవెంట్లో గోల్డ్ మెడల్ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ స్టార్ అథ్లెట్ను అందరూ అనుకరిస్తున్నారు. బాలీవుడ్ బేబీ రాకీ సావంత్ కూడా తన స్టయిల్లో జావెలిన్ విసిరింది. ఆమె చేసిన స్టంట్ అందర్నీ హుషారెత్తించింది. నీరజ్ చోప్రాను ఇమిటేట్ చేసిన రాఖీ.. జావెలిన్ లాంటి వెదురు కర్రను విసిరి ఫుల్ ఎంజాయ్ చేసింది. దానికి సంబంధించిన వీడియోను ఇన్స్టాలో పోస్టు చేశారు. జిమ్ డ్రెస్సులో ఉన్న రాఖీ సావంత్.. టీ షర్ట్ వేసుకుని.. వర్కౌట్ ప్యాంట్లో.. ఓ వెదురు బొంగును .. జావెలిన్ తరహాలో విసిరింది. ఆ స్టంట్ సమయంలో తీసిన వీడియోను ఓ ఫోటోగ్రాఫర్ ఇన్స్టాలో పోస్టు చేశాడు. ఆ త్రో మీరూ చూడాల్సిందే.