మంగళవారం 26 మే 2020
Cinema - May 15, 2020 , 09:09:46

ఓటీటీల‌పై ఆస‌క్తి..అసంతృప్తి వ్య‌క్తం చేసిన ఐనాక్స్‌..!

ఓటీటీల‌పై ఆస‌క్తి..అసంతృప్తి వ్య‌క్తం చేసిన ఐనాక్స్‌..!

లాక్‌డౌన్ కార‌ణంగా థియేట‌ర్స్ అన్నీ మూత‌ప‌డ‌డంతో నిర్మాత‌లు ఓటీటీ( అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, సన్‌ ఎన్‌ఎక్స్‌టీ)  మాధ్యమాల‌పై దృష్టి సారిస్తున్నారు. ఇప్ప‌టికే తెలుగులో అమృతరామ‌మ్ అనే చిత్రం ఓటీటీలో విడుద‌ల కాగా, హిందీలో అమితాబ్‌ బచ్చన్‌, ఆయుష్మాన్‌ ఖురానా కీలక పాత్రల్లో నటించిన 'గులాబో సితాబో' సినిమాను జూన్ 12న అమెజాన్‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు రీసెంట్‌గా ప్ర‌క‌టించారు.  మ‌రి కొన్ని చిత్రాలు డిజిట‌ల్ ప్లాట్‌ఫాంల‌లో విడుద‌ల‌య్యేందుకు సిద్ద‌మ‌య్యాయి. ఈ ప‌రిస్థితుల‌లో ఐనాక్స్ అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

ప్ర‌ముఖ ప్రొడ‌క్ష‌న్ సంస్థ త‌మ చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేయాల‌నుకోవ‌డం అసంతృప్త‌ని క‌లిగిస్తుంది.  ఐనాక్స్ దేశవ్యాప్తంగా, ప్రపంచ స్థాయి నాణ్యతా స్క్రీన్‌లను జోడించడానికి లోతుగా పెట్టుబడులు పెడుతోంది. సినిమాని ప్రేక్ష‌కుల‌కి మ‌రింత కనువిందుగా అందించ‌డానికి అనేక ప్ర‌య‌త్నాలు చేస్తుంది. కొన్ని దశాబ్ధాలుగా ప‌ర‌స్ప‌ర ఒప్పందంతో ఇది కొన‌సాగుతుంది. 

ఈ సమస్యాత్మక సమయాల్లో, పరస్పర ప్రయోజనకరమైన సంబంధాన్ని కొనసాగించడానికి  ఓ ప్రొడ‌క్ష‌న్ హౌజ్ త‌మ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయాల‌నుకోవ‌డం చాలా బాధ కలిగిస్తుంది. ఇలాంటి స‌మ‌యంలో ఒకరికొక‌రు అండ‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. తాజాగా తీసుకున్న చ‌ర్య‌ల‌తో ఇద్ద‌రి మ‌ధ్య ప‌ర‌స్ప‌ర ఒప్పందాలు తొల‌గిపోతాయి. ఇలాంటి ప‌రిస్థితుల‌లో ఐనాక్స్ కూడా కొన్ని విష‌యాల‌లో క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రించాల్సి వ‌స్తుంది.

సినిమా ప‌రిశ్ర‌మ‌కి వెన్న‌ముక‌గా నిలుస్తున్న ఐనాక్స్ ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో అద్భుతాలు చేసి చూపించింది. నిర్మాత‌ల‌కి , ఇత‌ర వాటాదారుల‌కి ఆదాయం అందించ‌డంలో స‌పోర్ట్‌గా నిలిచింది. ద‌యచేసి మీ అంద‌రిని కోరేది ఒక్క‌టే .. థియేట‌ర్‌లో చిత్రాల‌ని విడుద‌ల చేయ‌కుండా ఓటీటీలల‌ని ఆశ్ర‌యించ‌డం చేయ‌కండి. ఇది మంచి ప‌రిణామం కాదు అని ఐనాక్స్ పేర్కొంది.


logo