హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైన నటుడు వరుణ్ సందేశ్ కొన్ని పరాజయాల తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇటీవల బిగ్ బాస్ షోతో తన భార్యతో కలిసి సందడి చేశాడు. బిగ్ బాస్ షో వలన వరుణ్ సందేశ్‌కు కొంత క్రేజ్ దక్కడంతో దానిని క్యాష్ చేసుకోవాలని భావిస్తున్న వరుణ్ ప్రస్తుతం ఎం.ఎస్.ఆర్ దర్శకత్వంలో ఇందువదన అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ఫర్నాజ్ శెట్టి కథానాయిక కాగా, మాధవి ఆదుర్తి నిర్మాత.
కొద్ది సేపటి క్రితం ఇందువదన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో హీరోహీరోయిన్స్ బోల్డ్‌గా కనిపిస్తున్నారు. వరుణ్ సందేశ్.. క్లాసిక్ డేస్ కళాకారుడిలా శోభన్ బాబు రింగుతో సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. పోస్టర్‌తో మూవీపై మేకర్స్ ఆసక్తిని కలిగించారు. చిత్ర షూటింగ్ ఇప్పటికే మొదలు కాగా, ఈ సినిమాను 2021లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.