రైటర్ గా, దర్శకుడిగా తన మార్కును చూపిస్తుంటాడు ఇంద్రగంటి మోహనకృష్ణ (Indraganti Mohanakrishna). ఈ టాలీవుడ్ (Tollywood) రైటర్ కమ్ డైరెక్టర్ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. బెంచ్ మార్క్ స్టూడియోస్ తో కలిసి సినిమాను సమర్పిస్తున్నారు. రూరల్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ సంతోష్ కాట దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో నటీనటులకోసం కాస్టింగ్ కాల్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇంద్రగంటి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.
ఈ మధ్య నేనొక కథ విన్నాను. ఒక పల్లెటూరిలో జరిగిన ఆ కథ నాకు చాలా బాగా నచ్చింది. కథ వింటున్నంత సేపు ఒక అందమైన పల్లెటూరు నన్ను పలుకరించిందనిపించింది. ఆ కథలో నాకు గొప్ప స్వచ్చత నిజాయితీ కనబడ్డాయి. వెంటనే ఈ కథను ప్రేక్షకులతో పంచుకోవాలనిపించింది. అందుకే నేను, బెంచ్ మార్కు స్టూడియోస్ కలిసి కథను సినిమా రూపంలో మీ ముందుకు తీసుకొద్దామనుకున్నాం.
ఈ కథతో కొత్త నటీనటులను పరిచయం చేయాలి. వారి ద్వారా ఈ కథను చెప్పాలనుకున్నాం. నటనాసక్తి ఉన్న మీ అందరి కోసం ఈ కాస్టింగ్ కాల్. సినిమాలో నటించాలని కోరిక ఉన్న వారు మీ ఎంట్రీస్ ను మాకు పంపించండి. నేను, బెంచ్ మార్కు స్టూడియోస్, దర్శకుడు మీ ఎంట్రీస్ కోసం ఎదురుచూస్తుంటాం అని వీడియో ద్వారా తెలియజేశాడు ఇంద్రగంటి.
ఇవికూడా చదవండి..
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Samantha Akkineni | పాండిచ్చేరికి సమంత పయనం..!
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!