శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Cinema - Jul 07, 2020 , 11:06:22

షాహిద్ క‌పూర్‌కి ఇండియ‌న్ క్రికెట‌ర్స్ స‌పోర్ట్..!

షాహిద్ క‌పూర్‌కి  ఇండియ‌న్ క్రికెట‌ర్స్ స‌పోర్ట్..!

బాలీవుడ్ న‌టుడు షాహిద్ క‌పూర్ తెలుగులో మంచి విజ‌యం సాధించిన జెర్సీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు, అల్లు అరవింద్ లు కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థతో హిందీలో రీమేక్ చేస్తున్నారు. సినిమాలో త‌న పాత్ర ప్రేక్ష‌కుల‌ని మెప్పించాల‌నే ఉద్ధేశంతో షాహిద్ క‌పూర్ కొద్ది రోజులుగా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆయ‌న‌కి షాట్ సెల‌క్ష‌న్‌, బ్యాటింగ్ స్టైల్ త‌దిత‌ర విష‌యాల‌లో అనేక మంది క్రికెట‌ర్స్ సాయప‌డుతున్న‌ట్టు తెలుస్తుంది.

 ప్రముఖ రంజీ క్రికెటర్స్ తో పాటు జాతీయ స్థాయి క్రికెటర్స్ షాహిద్‌కి క్రికెట్ పాఠాలు నేర్పుతున్నారు. ఆ మ‌ధ్య రోహిత్ శ‌ర్మ దగ్గ‌ర అనేక మెలుకువ‌లు నేర్చుకున్న షాహిద్ ప్ర‌స్తుతం  రోహిత్ శర్మ కు వ్యక్తిగత శిక్షకుడు అయిన దినేష్ లాడ్ వద్ద శిక్షణ పొందుతున్నాడట. రానున్న రోజుల‌లో మ‌రి కొంద‌రు టీం ఇండియా క్రికెట‌ర్స్ ద‌గ్గ‌ర కూడా శిక్ష‌ణ తీసుకొని క్రికెట్‌పై పూర్తి ప‌ట్టు సాధించాల‌ని భావిస్తున్నాడ‌ట 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo