ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 25, 2020 , 14:21:50

బాలు కీర్తి త‌ర‌త‌రాలు నిలిచిపోతుంది..సినీ ప్ర‌ముఖుల సంతాపం

బాలు కీర్తి త‌ర‌త‌రాలు నిలిచిపోతుంది..సినీ ప్ర‌ముఖుల సంతాపం

ప్ర‌ముఖ గాయకుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మృతి సినీప్ర‌ముఖులు తీవ్ర‌దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఎస్పీ బాలు త‌న పాట‌ల‌తో కోట్లాది మంది హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోతార‌ని, ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుణ్ణి ప్రార్థించారు. 

సినీ ప్ర‌ముఖుల సంతాపం ‌:

బాలు మ‌ర‌ణ‌వార్త‌తో నా హృద‌యం ముక్క‌లైందని ట్వీట్ చేసిన ఏఆర్ రెహ‌మాన్ బాలుతో క‌లిసి ఉన్న ఫొటోను ట్విట‌ర్ లో పోస్ట్ చేశాడు. 

బాలు కీర్తి త‌ర‌త‌రాలు నిలిచిపోతుంద‌ని సినీ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ అన్నారు. బాలు ఉన్న కాలంలో ఉండ‌టం మా అదృష్టంగా భావిస్తున్నామ‌న్నారు. 

బాలు మృతితో ఓ లెజెండ్ ను కోల్పోయామ‌ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశాడు. . 

ఎప్ప‌టికీ మ‌రిచిపోలేని వ్య‌క్తి ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం అని సినీ న‌టి ర‌మ్య‌కృష్ణ అన్న‌రు. 

బాలు లేని లోటు ఊహించ‌లేనిది. ఆగిపోయింది మీ గుండె మాత్రమే..గొంతు కాద‌ని ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ గుర్తు చేసుకున్నాడు. 

ఎస్పీ బాలు మృతితొ నా హృద‌యం ముక్క‌లైంది. సినీప‌రిశ్ర‌మ‌కు బాలు చేసిన వెల‌క‌ట్ట‌లేని సేవ‌ల‌కు వ‌రుణ్ తేజ్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo