ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 07, 2020 , 08:51:28

సెట్‌లో మ‌ర‌ణించిన వారికి కోటి రూపాయ‌లు అందించిన క‌మ‌ల్

సెట్‌లో మ‌ర‌ణించిన వారికి కోటి రూపాయ‌లు అందించిన క‌మ‌ల్

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇండియన్‌-2’  సినిమా సెట్‌లో కొద్ది రోజుల క్రితం క్రేన్ ప్ర‌మాదం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో మ‌ధు, చంద్ర‌న్‌, కృష్ణ అనే ముగ్గురు టెక్నీషియ‌న్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్ర‌మాదం చిత్ర బృందంతో పాటు అంద‌రిని ఎంత‌గానో క‌లిచి వేసింది.  ప్ర‌మాదం ప‌ట్ల దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన శంక‌ర్ నాకు జ‌రిగిన బాగుండేది అని వ్యాఖ్యానించారు.  శంక‌ర్, క‌మ‌ల్‌, కాజ‌ల్ ప్ర‌మాదం నుండి తృటిలో త‌ప్పించుకున్న విష‌యం తెలిసిందే.

అయితే ప్ర‌మాదం జ‌రిగిన త‌ర్వాత క‌మ‌ల్ చనిపోయిన వారి  కుటుంబ‌స‌భ్యుల‌కు కోటి రూపాయాలు న‌ష్ట‌ప‌రిహారం ఇస్తామ‌ని ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. అన్న‌ట్టుగానే ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు నటుడు కమలహాసన్, దర్శకుడు శంకర్ తరపున తలా కోటి రూపాయిలు, లైకా నిర్మాణసంస్థ తరపున 2 కోట్ల రూపాయిలను అందించారు. క‌మ‌ల్‌, శంక‌ర్ చేతుల మీదుగా బాధిత కుటుంబాలు న‌ష్ట‌ప‌రిహారం అందుకున్నాయి.  రానున్న రోజుల‌లో సెట్‌లో ఇలాంటి ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటాం అని క‌మ‌ల్‌, శంక‌ర్ స్ప‌ష్టం చేశారు. logo