శనివారం 30 మే 2020
Cinema - Apr 29, 2020 , 12:50:22

ఇర్ఫాన్ మ‌ర‌ణం..ప్ర‌ముఖుల సంతాపం

ఇర్ఫాన్ మ‌ర‌ణం..ప్ర‌ముఖుల సంతాపం

బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌(53) ఆక‌స్మిక మృతి అంద‌రిని షాక్‌కి గురి చేస్తుంది. కొన్నేళ్లుగా క్యాన్సర్‌ వ్యాధితో పోరాటం చేస్తున్న ఆయ‌న ఈ రోజు  ముంబైలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆస్పత్రిలో కన్ను మూశారు.  ఇర్ఫాన్ మృతి సినీ ప‌రిశ్ర‌మ‌నే కాక రాజ‌కీయ ప్ర‌ముఖుల‌ని కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది.

ఇర్ఫాన్ మృతిపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ఇర్ఫాన్ ఖాన్ మృతి న‌న్ను షాక్‌కి గురి చేసింది. మా కాలంలోని అసాధార‌ణ‌మైన న‌టుల‌లో ఆయ‌న ఒక‌రు. ఇర్ఫాన్ ప‌నిత‌నం ఎప్ప‌టికీ గుర్తుంటుంది. అత‌ని ఆత్మకి శాంతి చేకూరాల‌ని ప్రార్ధిస్తున్నాను - కేజ్రీవాల్

ఇర్ఫాన్ మ‌ర‌ణ‌వార్త విన్నాను. ఈ వార్త న‌న్ను ఎంతో క‌ల‌చివేసింది. చాలా విచార‌క‌ర‌మైన వార్త‌. ఎంతో అద్భుత‌మైన ప్ర‌తిభ‌.. ద‌యాహృద‌యం ఉన్న‌స‌హా న‌టుడు.. సినిమా ప్ర‌పంచానికి ఎంతో సేవ చేసిన న‌టుడు..మ‌న‌ల్ని చాలా త్వ‌రగా వ‌దిలి వెళ్లారు.  మీ ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని దేవుడిని ప్రార్ధిస్తున్నాను - అమితాబ్ బ‌చ్చ‌న్

 ఇర్ఫాన్ ఖాన్ బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి. అత‌ని మ‌ర‌ణం నన్ను షాక్‌కి గురి చేసింది. ఇర్ఫాన్ కుటుంబ స‌భ్యుల‌కి, ఫ్రెండ్స్‌, ఫ్యాన్స్ అంద‌రికి నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను- ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ 

నా ప్రియమైన స్నేహితుడు ఇర్ఫాన్. మీరు పోరాడారు, పోరాడారు, పోరాడారు. నేను మీ గురించి ఎప్పుడూ గర్వపడతాను ..  మళ్ళీ మ‌నం కలుద్దాం .. సుతాపా మరియు బాబిల్ కు సంతాపం .. మీరు కూడా పోరాడారు, సుతాపా మీరు ఈ పోరాటంలో సాధ్యమైనవన్నీ ఇచ్చారు. శాంతి మరియు ఓం శాంతి. ఇర్ఫాన్ ఖాన్‌కి వందనం- సూజిత్ స‌ర్కార్


logo