మంగళవారం 19 జనవరి 2021
Cinema - Dec 28, 2020 , 06:50:25

జ‌డేజా అర్ధ సెంచ‌రీ.. భార‌త్ 325/8

జ‌డేజా అర్ధ సెంచ‌రీ.. భార‌త్ 325/8

తొలి టెస్ట్‌లో ఘోరంగా విఫ‌లమైన భార‌త్  రెండో టెస్ట్‌లో పుంజుకుంది. కెప్టెన్ అజింక్యా ర‌హానే(112) అద్భుత‌మైన ఇన్నింగ్స్‌తో భార‌త్ ఎనిమిది  వికెట్ల న‌ష్టానికి 325 ప‌రుగులు చేసింది. దీంతో టీమిండియాకు 126 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 327/5తో సోమ‌వారం  ఇన్నింగ్స్‌ కొనసాగించిన టీమ్‌ఇండియా.. ఆరంభంలో ఆచితూచి ఆడింది. అయితే లేని ర‌న్‌కు ప్ర‌య‌త్నించ‌డంతో స్టాండిన్ కెప్టెన్  అజింక్యా ర‌హానే ర‌నౌట్‌గా వెనుదిరిగాడు.

ఇటు బౌలింగ్‌తో పాటు అటు బ్యాటింగ్‌లోను రాణిస్తున్న రవీంద్ర జ‌డేజా(57) మ‌రోసారి అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియా గౌర‌వ‌ప్ర‌దమైన స్కోరు చేయ‌డంలో దోహ‌దప‌డ్డాడు. అయితే స్టార్క్ వేసిన బౌన్స‌ర్స్ ఫుల్ షాట్ ఆడే ప్ర‌య‌త్నంలో ఔట‌య్యాడు. ఇక ఉమేష్ యాద‌వ్(9) ప‌రుగులు చేసి లియాన్ బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. ప్ర‌స్తుతం క్రీజులో అశ్విన్‌(14)తో పాటు బుమ్రా(0) ఉన్నారు.