బుధవారం 27 జనవరి 2021
Cinema - Dec 28, 2020 , 07:08:19

భార‌త్ 326 ఆలౌట్.. 131 ప‌రుగుల ఆధిక్యం

భార‌త్ 326 ఆలౌట్.. 131 ప‌రుగుల ఆధిక్యం

రెండో టెస్ట్‌లో భార‌త్ బెబ్చులిలా రెచ్చిపోయింది. ఇటు బౌలింగ్‌, అటు బ్యాటింగ్‌‌లో అత్య‌ద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. ‌స్టాండిన్ కెప్టెన్ అజింక్యా ర‌హానే(112), ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా(57) అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 326 ప‌రుగులు చేసి ఆలౌట్ అయింది. ఓవ‌ర్‌నైట్ స్కోరు 327/5తో ఈ రోజు ఇన్నింగ్స్ పెట్టిన భార‌త్‌కు ఆదిలోనె దెబ్బ తగిలింది. ర‌హానే ర‌నౌట్ కావ‌డంతో జ‌డేజా..అశ్విన్‌(14)తో క‌లిసి స్కోర్ బోర్డ్‌ని ముందుకు న‌డిపించే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే స్టార్క్ బౌన్స‌ర్స్‌తో జ‌డేజాని ఇబ్బంది పెడుతున్న క్ర‌మంలో పుల్ షాట్ ఆడ‌బోయి ఔట‌య్యాడు.

ఇక ఉమేష్ యాద‌వ్(9), బుమ్రా (0), సిరాజ్‌(0 నాటౌట్‌) వెంట‌వెంట‌నే  ఔట్ కావ‌డంతో భార‌త్  326 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియాకు 131 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది.ఇక  మ‌రో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేప‌థ్యంలో రిజ‌ల్ట్ త‌ప్పక రానుంది. ఆసీస్ బౌల‌ర్స్ విష‌యానికి వ‌స్తే స్టార్క్ 3, క‌మ్మిన్స్ 2, లియాన్ 2, హేజిల్‌వుడ్ ఒక వికెట్ తీసారు. 


logo