శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Apr 05, 2020 , 18:22:40

ఇండియాను ఇటలీ చేయొద్దు

ఇండియాను ఇటలీ చేయొద్దు

ఇండియాను ఇటలీ చేయొద్దు

సినీతార‌లు, క్రికెట‌ర్స్ ఇలా ఒక్కొక్క‌రూ ఒక్కో రూపంలో క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ న‌టి మీన సైతం క‌రోనాపై అవ‌గాహ‌న సందేశం ఇచ్చింది. 

ఇండియాను మ‌రో ఇట‌లీ చేయొద్దు. ప్ర‌తి ఒక్క‌రూ ఇంటికే ప‌రిమిత‌మైతే క‌రోనాను త‌రిమేయ‌వ‌చ్చు. లాక్‌డౌన్‌ను ఇప్ప‌టికీ కొంద‌రు సీరియ‌స్‌గా తీసుకోకుండా రోడ్ల‌పైకి వ‌స్తున్నారు. ప్ర‌యాణాలు చేస్తున్నారు. వీరిని చూస్తుంటే బాధ‌గా ఉంది. ద‌య‌చేసి ప్ర‌భుత్వం చెప్పిన‌ట్లు న‌డుచుకోవాలి,.  ప్ర‌భుత్వం చెప్పింది విన‌కుండా ఇష్టమొచ్చినట్లు చేసినందుకే ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో  శవాలు  గుట్టలుగా పడి ఉన్నాయి. విదేశాల్లో చనిపోతే శవాలు ముట్టుకోడానికి కూడా ఎవరూ ముందుకు రాని ప‌రిస్థితి. దయచేసి ఇండియాను అలా చేయొద్దు. అని ఆమె ప్ర‌జ‌ల్ని వేడుకుంటున్న‌ది. logo