ఒకరు దర్శక దిగ్గజం, మరొకరు ప్రముఖ నిర్మాణ సంస్థ. ఈ ఇద్దరి కాంబినేషన్లో భారతీయుడు 2 అనే సినిమా రూపొందుతుంది. 2018లో ఈ చిత్ర షూటింగ్ మొదలు పెట్టగా, అనివార్య కారణాల వలన ఆగిపోయింది. అయితే ఈ కారణాలనికి కారణం శంకర్ అని లైకా సంస్థ చెబుతుంటే తాను కాదే కానంటున్నాడు శంకర్. ఈ విషయం కోర్టు వరకు కూడా వెళ్లడంతో ఇద్దరిని కూర్చొని చర్చించుకోమని సలహా ఇచ్చింది.
కొద్ది రోజుల క్రితం దర్శకుడు శంకర్ తెలుగులో రామ్‌చరణ్ హీరోగా ఒకటి, హిందీలో రణబీర్‌సింగ్‌తో ఒక చిత్రాన్ని చేయడానికి సిద్ధమయ్యారు. మా నిర్మాణంలో రూపొందుతున్న చిత్రాన్ని పూర్తి చేయకుండా ఆ సినిమాలు ఎలా అనౌన్స్ చేస్తారని శంకర్‌పై కస్సు బుస్సుమంటుంది లైకా . అంతేకాదు ఇప్పటికే తెలుగు ఫిలిం ఛాంబర్‌కు, హిందీ ఫిలిం ఛాంబర్‌కు షూటింగ్ చేయనివ్వొద్దని లేఖలు కూడా రానినట్టు తెలుస్తుంది. ఈ విషయంలో వెనక్కు తగ్గేదే లేదని, ఏదో ఒకటి తేల్చుకుంటామని లైకా అంటుంది. చూడాలి మరి రానున్న రోజులలో ఈ వివాదం ఎలా సద్దమణుగుతుందో..!