శనివారం 05 డిసెంబర్ 2020
Cinema - Oct 21, 2020 , 01:35:35

ఆండ్రాయిడ్‌ కుంజప్పన్‌ రీమేక్‌లో

ఆండ్రాయిడ్‌ కుంజప్పన్‌ రీమేక్‌లో

సీనియర్‌ నటుడు మోహన్‌బాబు మలయాళ రీమేక్‌లో నటించనున్నారా? అంటే ఔననే వార్తలు వినిపిస్తున్నాయి. సూరజ్‌ వెంజమూడు, సౌబిన్‌ షాహిర్‌ ప్రధాన పాత్రల్లో మలయాళంలో రూపొందిన ‘ఆండ్రాయిడ్‌ కుంజప్పన్‌ వెర్షన్‌ 5.25’ చిత్రం విమర్శకుల ప్రశంసల్ని అందుకుంది.  రోబోకు, వృద్ధుడికి మధ్య సాగే భావోద్వేగభరిత ప్రయాణం నేపథ్యంలో దర్శకుడు రతీష్‌ బాలకృష్ణన్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. బతుకు బాటలో దూరప్రాంతాలకు పిల్లలు వెళ్లిపోవడంతో వృద్ధాప్యంలో తల్లిదండ్రులు పడే వ్యథల్ని సున్నితంగా ఈ సినిమాలో చూపించారు.  ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ పతాకంపై ఆయనే స్వయంగా ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు  తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక  ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.