అరుణ్ అదిత్, మేఘా ఆకాష్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డియర్ మేఘ’. సుశాంత్‌రెడ్డి దర్శకుడు. అర్జున్ దాస్యన్ నిర్మాత. అరుణ్ అదిత్ జన్మదినం సందర్భంగా మంగళవారం చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదలచేసింది. దర్శకుడు మాట్లాడుతూ ‘అందమైన ప్రేమకథా చిత్రమిది. మేఘ అనే అమ్మాయితో ప్రేమలో పడిన ఇద్దరబ్బాయిల కథతో ఆసక్తికరంగా సాగుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర, సినిమాటోగ్రఫీ: ఐ ఆండ్రూ.