అగ్ర నటుడు అక్కినేని నాగార్జున ఎన్.ఐ.ఏ అధికారిగా శక్తివంతమైన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వైల్డ్‌డాగ్’. అహిషోర్ సాల్మన్ దర్శకుడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఏప్రిల్ 2న ప్రేక్షకులముందుకురానుంది. శుక్రవారం ట్రైలర్‌ను అగ్రనటుడు చిరంజీవి విడుదల చేశారు. బాంబు దాడుల ద్వారా వందలాది మందిని బలి తీసుకున్న ఉగ్రవాదులను తుదముట్టించడానికి ఏసీపీ విజయ్‌వర్మ నేతృత్వంలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) టీమ్ చేసిన సాహసోపేతమైన పోరాటం నేపథ్యంలో ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠను పంచింది. ‘అరెస్ట్ చేసుకోండి సార్’ అంటూ చేతులెత్తి హేళనగా చూస్తున్న ఓ ముష్కరుడిని క్షణం ఆలస్యం చేయకుండా విజయ్‌వర్మ షూట్ చేయడం థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది. టెర్రరిస్టుల పాలిట యముడిలా ఏసీపీ విజయ్‌వర్మ పాత్రలో నాగార్జున డేరింగ్ అండ్ డాషింగ్‌గా కనిపించారు.