శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Cinema - Jul 05, 2020 , 12:44:02

‘దృశ్యం’లో వెంకీ చిన్నకూతురు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..!

‘దృశ్యం’లో వెంకీ చిన్నకూతురు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..!

హైదరాబాద్‌ : సినీ ప్రపంచంలో నటీనటుల్లో చాలా మార్పులు వస్తుంటాయి. అదే తరహాలో కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఆచ్చర్యపరుస్తుంటారు. 2014లో వచ్చిన దృశ్యం సినిమాలో వెంకటేశ్‌ చిన్న కూతురిగా నటించిన ఎస్తేర్ అనిల్ ఇప్పుడు ఊహీంచని లుక్‌తో దర్శనమిస్తోంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన కొన్ని గ్లామర్ ఫోటోలు నెటీజన్‌లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మలయాళం ఆడియన్స్‌కి ఆమె రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నప్పటికీ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా టచ్‌లో లేదు. ఆ మధ్య జోహార్ అనే చిత్రంలో నటించింది కానీ ఎవరూ గుర్తుపట్టలేదు.

దృశ్యం సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. అందులో నటించిన ప్రతి ఒక్కరి నటన ఎంతగానో ఆట్టుకుంటుంది.  వెంకీ రెండో కూతురిగా నటించిన ఎస్తేర్ అనిల్ పాత్ర కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అప్పుడప్పుడు మలయాళం సినిమాలు చేసుకుంటూ చదువును పూర్తి చేసే పనిలో పడింది ఎస్తేర్. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo