e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home సినిమా రామరాజు నిరీక్షణలో..

రామరాజు నిరీక్షణలో..

బాలీవుడ్‌ అగ్ర కథానాయికల్లో ఒకరైన అలియాభట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె రామ్‌చరణ్‌కు జోడీగా సీత పాత్రలో కనిపించనుంది. సోమవారం అలియాభట్‌ పుట్టినరోజును పురస్కరించుకొని సినిమాలోని ఆమె ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘మహా సంకల్పం, దృఢచిత్తం కలిగిన సీత.. రామరాజుకోసం నిరీక్షించే ఘట్టం మహాద్భుతమైనదిగా ఉండబోతుంది’ అంటూ చిత్ర బృందం  ఫస్ట్‌లుక్‌పై వ్యాఖ్యానించింది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమరం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. దాదాపు 400కోట్ల భారీ వ్యయంతో రాజమౌళి దర్శకత్వంలో  డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కీరవాణి స్వరకర్త. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. అక్టోబర్‌ 13న ప్రేక్షకులముందుకురానుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రామరాజు నిరీక్షణలో..

ట్రెండింగ్‌

Advertisement