గోవా సుందరి ఇలియానా డిజిటల్ ప్లాట్ఫామ్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందా?వెబ్‌సిరీస్‌లో నటించనుందా?అంటే ఔననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. టాలీవుడ్లో అగ్ర కథానాయికల్లో ఒకరిగా గుర్తింపును సొంతం చేసుకున్న ఈ సొగసరి కెరీర్ జోరుమీదున్న తరుణంలోనే బాలీవుడ్ బాట పట్టింది. ఎన్నో కలలతో హిందీ చిత్రసీమలో అడుగుపెట్టిన ఆమెకు నిరాశే మిగిలింది. బాలీవుడ్లో ఆశించిన స్థాయిలో ఇలియానాకు అవకాశాలు రాలేదు. కొన్ని విజయాలు వరించిన అవేవీ ఆమెకు గుర్తింపును తెచ్చిపెట్టలేకపోయాయి. సినిమాలపై ఆశలు వదులుకున్న ఆమె కొంతకాలంగా వెబ్‌సిరీస్‌లపై దృష్టిసారిస్త్తున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా ఓ వెబ్‌సిరీస్‌కు ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అజయ్‌దేవ్‌గణ్ ప్రధాన పాత్రలో ‘రుద్ర’ పేరుతో హిందీలో ఓ వెబ్‌సిరీస్ రూపొందుతున్నది.సైకలాజికల్ క్రైమ్ కథాంశంతో ముంబయి నేపథ్యంలో సాగే ఈ వెబ్‌సిరీస్‌లో అజయ్ దేవ్‌గణ్‌కు జోడీగా ఇలియానా నటించబోతున్నట్లు సమాచారం. డీ గ్లామర్ పాత్రలో ఆమె కనిపించనున్నట్లు తెలిసింది.‘భాద్షాహో’, ‘రైడ్’ తర్వాత అజయ్‌దేవ్‌గణ్, ఇలియానా మూడోసారి ఈ సిరీస్‌లో జంటగా నటించబోతున్నారు.