గోవా బ్యూటీ ఇలియానా ఒకప్పుడు తన అందచందాలతో కుర్రకారుని ఎంతగా ఆకర్షించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య సినిమా ఆఫర్స్ ఇల్లీ బేబికి కాస్త తగ్గాయి. దీంతో ప్రియుడు ఆండ్రూ నీబోన్‌తో విలువైన సమయం గడపడంతో పాటు సోషల్ మీడియాలో తన గ్లామర్ షోతో రచ్చ చేస్తూ వస్తుంది. అయితే ఒక్కోసారి నెటిజన్స్ దృష్టి ఇలియానా డ్రెస్సెస్, ఆమె ధరించే ఆభరణాలపైన పడుతుంది. తాజాగా ఇలియానా మెడలో ఉన్న స్పెషల్ లాకెట్‌పై అభిమానులు దృష్టి సారించారు
ఇలియానా మెడలో ఉన్న లాకెట్ ఏ బ్రాండ్.. దాని ప్రత్యేకత ఏమిటి? దాని వెనక మీనింగ్ ఏమిటి? అంటూ ఆరాలు తీస్తున్నారు. నెక్లెస్‌లో స్పిరిట్ ఐ పెండెంట్ .. ఈవిల్ ఐ లాకెట్ .. మల్టీ స్టాండ్ ఉమెన్ లాకెట్స్ అంటూ బోలెడన్ని వెరైటీలు ఉన్నాయి. ఇలియానా ధరించింది కాస్త డిఫరెంట్ అంటున్నారు . కాగా, ఈ భామ నటించిన ది బిగ్ బుల్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ది బెస్ట్ వీక్షణలు సాధించిందని ఇలియానాతో పాటు.. ఇందులో నటించిన కథానాయకుడు అభిషేక్ బచ్చన్ కూడా ప్రకటించారు.