మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 25, 2020 , 20:45:20

బాలు మృతితో బ‌రువెక్కిన ఇళ‌య‌రాజా హృదయం

బాలు మృతితో బ‌రువెక్కిన ఇళ‌య‌రాజా హృదయం

సినీ సంగీత ప్ర‌పంచంలో బాలసుబ్ర‌హ్మ‌ణ్యం, ఇళ‌య‌రాజాల ప్ర‌స్థానం అద్వితీయం. ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఎన్నో సూప‌ర్ హిట్ సాంగ్స్ సంగీత ప్రేమికుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. 90ల‌లో వీరిద్ద‌రిదే హ‌వా. అయితే మ‌ధ్య‌లో ఇద్దరి మ‌ధ్య కొంత గ్యాప్ వ‌చ్చినా కూడా ఒక‌రంటే ఒక‌రికి చాలా ప్రేమ‌. బాలు అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరాడ‌ని తెలిసిన ఇళ‌య‌రాజా ఓ వీడియో విడుద‌ల చేశారు. మ‌న స్నేహం సినిమాల‌కు మాత్ర‌మే ప‌రిమితం కాదు. ఇక్క‌డితో ముగిసిపోదు. సంగీతం మ‌న జీవితం. జీవ‌త‌మే సంగీతం. మ‌న స్నేహాన్ని, ప్రేమ‌ను ఎవ‌రు వేరు చేయ‌లేరు. నువ్వు త్వ‌ర‌గా కోలుకొని వ‌స్తావ‌ని నా హృద‌యం చెబుతుంది. త్వ‌ర‌గా వ‌చ్చేయ్ బాలు అంటూ ఎంతో ఉద్వేగంతో త‌న మ‌న‌సులోని భావాల‌ని తెలియ‌జేశారు ఇళ‌య‌రాజా.

ఈ రోజు ఎస్పీబీ మ‌న మ‌ధ్య లేర‌నే విష‌యం తెలుసుకున్న ఇళ‌య‌రాజా హృద‌యం బ‌రువెక్కింది. నోట మాట రాలేదు. ఎంతో ఆవేద‌న‌తో .. బాలు నీ కోసం నేను ఎద‌రు చూస్తుంటా, తిరిగి ర‌మ్మ‌ని చెప్పాను క‌దా. నా మాట‌లు విన‌కుండా ఎక్క‌డికి వెళ్లావు? ఎందుకు వెళ్ళావు? గ‌ంధ‌ర్వుల కోసం పాడేందుకు వెళ్ళావా? ఇక ఇప్పుడు ప్రపంచంలోని దేన్నీ నేను చూడ‌లేను. మాట‌లు రావ‌డం లేదు. ఏం మాట్లాడాలో కూడా తెలియ‌డం లేదు. దుఃఖానికి కూడా ప‌రిమితి ఉంటుంది. నీ విష‌యంలో దానికి ప‌రిమితి లేదంటూ ఎంతో భావోద్వేగానికి లోన‌య్యారు ఇళ‌య‌రాజా.


logo