బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Sep 02, 2020 , 15:15:13

థియేట‌ర్స్ తెర‌వ‌కపోతే, ప్రైవేట్ థియేట‌ర్ బుక్ చేసుకుంటా..!

థియేట‌ర్స్ తెర‌వ‌కపోతే, ప్రైవేట్ థియేట‌ర్ బుక్ చేసుకుంటా..!

క‌రోనా ..సినీ పరిశ్ర‌మపై తీవ్ర ప్ర‌భావం చూపుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌హ‌మ్మారి వ‌ల‌న థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. షూటింగ్స్ స్తంభించాయి. దీంతో నిర్మాత‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. రానున్న రోజుల‌లో ప్ర‌భుత్వం థియేట‌ర్స్ ఓపెన్ చేసేందుకు అనుమ‌తి ఇచ్చిన‌ప్ప‌టికీ ఎంత మేర‌కు ప్ర‌జ‌లు థియేట‌ర్స్ కి వ‌స్తార‌న్న‌ది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. మ‌రి ఇలాంటి పరిస్థితుల‌లో రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న సినిమాల ప‌రిస్థితి ఏంట‌నే దానిపై చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

జేమ్స్‌బాండ్‌ సిరీస్‌లోని తాజా సినిమా ‘నో టైమ్‌ టు డై’. డానియల్‌ క్రెగ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ రెండోవారంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సింది . కాని క‌రోనా వ‌ల‌న అతిపెద్ద మార్కెట్‌ అయిన చైనాలో థియేటర్లు మూతపడటంతో   ఈ చిత్రాన్ని నవంబర్‌ 12వ తేదీకి వాయిదా వేసారు. అయితే అప్ప‌టికి థియేట‌ర్స్ ఓపెన్ కాక‌పోతే ప్రైవేట్ థియేట‌ర్ బుక్ చేసుకుంటానంటున్నాడు చుంకీ పాండే

జేమ్స్ బాండ్ సిరీస్‌ల‌కి వీరాభిమాని అయిన చుంకీ.. ‘నో టైమ్‌ టు డై’ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.  ఆయ‌న  ఇప్పటివరకు అన్ని జేమ్స్ బాండ్ సిరీస్‌ల‌ను వీక్షించాడు. తాజా చిత్రాన్ని కూడా వీక్షించాల‌ని అది కూడా థియేట‌ర్‌లోనే చూడాల‌ని ఆశిస్తున్నాడు. నో టైమ్ టూ డై రిలీజ్ వ‌ర‌కు థియేట‌ర్స్ ఓపెన్ కాక‌పోతే , నేను ఒక ప్రైవేట్ థియేటర్ అయిన‌ బుక్ చేసి చూస్తాను అంటున్నాడు చుంకీ. చివ‌రిగా ఈయ‌న సాహో చిత్రంలో మెరిసిన సంగ‌తి తెలిసిందే. 


logo