సోమవారం 08 మార్చి 2021
Cinema - Jan 15, 2021 , 21:47:35

ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..క్రాక్‌ నటుడి మనోగతం

ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..క్రాక్‌ నటుడి మనోగతం

దర్శకుడిగా మొదలు పెట్టి మధ్యలో నటుడిగా మారి ఇదే ప్రొఫెషన్ బాగుందని ఇక్కడే సెటిల్ అయిపోయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. తెలుగులో పోసాని కృష్ణమురళి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. వందల సినిమాలకు రైటర్‌గా పని చేసిన ఈయన ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ అయిపోయాడు. అలాగే తమిళనాట కూడా సముద్రఖని ఉన్నాడు. ఈయన కూడా దర్శకుడిగా వచ్చి.. నిర్మాతగా మారి.. మధ్యలో రచయితగా కూడా చేసి.. ఇప్పుడు నటుడిగా బిజీ అవుతున్నాడు. తమిళంలో ఇప్పటికే స్టార్ యాక్టర్ అయిన ఈయన ఇప్పుడు తెలుగులోనూ స్టార్ అవుతున్నాడు. గతేడాది అల వైకుంఠపురములో సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ఇప్పుడు క్రాక్ సినిమాతో పిచ్చెక్కిస్తున్నాడు. కఠారి కృష్ణ పాత్రకు ప్రాణం పోసాడు సముద్రఖని. 

ఈ పాత్రలో ఈయన్ని తప్ప మరొకరిని ఊహించుకోలేమో అనేంతగా రెచ్చిపోయాడు సముద్రఖని. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇంత స్టార్ డమ్ అనుభవిస్తున్న ఈయన ఒకప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. ఈ విషయం తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ఇప్పుడు స్టార్ అయ్యాడు కానీ కెరీర్ మొదట్లో మాత్రం అవకాశాల కోసం కాళ్లు అరిగిపోయేలా తిరిగాడు. ముఖ్యంగా తనకు చెప్పులు, షూస్ అంటే చాలా యిష్టమని.. ఇప్పటికీ తన సంపాదనలో చాలా వరకు వాటికోసమే ఖర్చు చేస్తానంటున్నాడు సముద్రఖని. ఇదిలా ఉంటే అప్పట్లో కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా తిరిగేవాడినని.. అలాంటి సమయంలోనే కాళ్లకు బొబ్బలు వచ్చి అవి పగిలి రక్తం కూడా కారేదని గతం గుర్తు చేసుకున్నాడు. 

ఒకానొక సమయంలో తన రూమ్ మేట్ బాత్రూమ్ కు వేసుకునే చెప్పులు చెప్పుకుండా వేసుకుని వెళ్తే.. వాడు రోడ్డు మీద నిలబెట్టి తనను అవమానించి చెప్పులు వేసుకెళ్లిపోయాడని కన్నీరు పెట్టుకున్నాడు. అలాంటి సమయంలో ఈ జీవితం ఎందుకు.. ఆత్మహత్య చేసుకుని వచ్చే జన్మలో అయినా సరిగ్గా సినిమాల్లోకి వెళ్దాం అనుకున్నానని చెప్పాడు సముద్రఖని. అలా రక్తం కారుతున్న కాళ్లతోనే నడుచుకుంటూ వెళ్తున్న తనకు ఒకరు వచ్చి లిఫ్ట్ ఇచ్చి ధైర్యం చెప్పాడని చెప్పుకొచ్చాడు.

ఆయన చెప్పిన మూడు రోజుల తర్వాత తనకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం వచ్చిందని.. తొలి పారితోషికం 100 రూపాయలు అని చెప్పాడు సముద్ర. అవి తీసుకెళ్లి మూడు జతల చెప్పులు కొని.. తనను అవమానించిన రూమ్ మేట్‌కు ఓ జత గిఫ్ట్ ఇచ్చానని చెప్పాడు. ఆ తర్వాత దర్శకుడిగా అవకాశం వచ్చిందని.. అక్కడ్నుంచి నటుడిగా మారానని చెప్పాడు. ప్రస్తుతం ఈయన తెలుగులో ట్రిపుల్ ఆర్ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ సినిమాలోనూ నటిస్తున్నాడు.

ఇవి కూడా చ‌ద‌వండి

కృతిస‌న‌న్‌ క‌విత్వానికి నెటిజ‌న్లు ఫిదా

పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌భాస్ 'స‌లార్' షురూ

ర‌వితేజకు రెమ్యున‌రేష‌న్ ఫార్ములా క‌లిసొచ్చింది..!

మ‌రో క్రేజీ ప్రాజెక్టులో స‌ముద్ర‌ఖ‌ని..!

మంచులో వ‌ణుకుతూ 'న‌దిలా న‌దిలా' మేకింగ్ వీడియో

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo