శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 26, 2020 , 21:45:58

అమ్మాయి న‌చ్చితే పెళ్లికి రెడీ !

అమ్మాయి న‌చ్చితే పెళ్లికి రెడీ !

టాలీవుడ్ యాక్ట‌ర్ సాయిధ‌ర‌మ్ తేజ్ పెళ్లిపై ఇప్ప‌టికే చాలాసార్లు వార్త‌లు వ‌చ్చాయి. ఈ యువ‌న‌టుడు బ్యాచిల‌ర్ లైఫ్ కు త్వ‌ర‌లోనే గుడ్ బై చెప్ప‌నున్నాడ‌ని న్యూస్ చ‌క్క‌ర్లు కొట్టింది. సాయిధ‌ర‌మ్ సోలో డేస్ త్వ‌ర‌లోనే ముగియ‌నున్నాయ‌ని అత‌ని బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిరంజీవి ఓ ట్వీట్ కూడా చేశాడు.

అయితే సాయిధ‌ర‌మ్ తేజ్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ..ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నార‌ని, పెళ్లంటే త‌న‌కు ఇప్పుడు ఆస‌క్తి లేద‌ని చెప్పుకొచ్చాడు. ఇంట్లో వాళ్లు త‌న‌పై ఒత్తిడి చేస్తుంటే సంబంధాలు చూడ‌మ‌ని మాత్రం చెప్పాన‌ని.. ఇప్ప‌టికైతే పెళ్లిపై అంత‌గా ఆలోచ‌న ఏమీ లేద‌న్నాడు. ఒక‌వేళ అమ్మాయి బాగా న‌చ్చితే అప్ప‌డు ఆలోచిస్తాన‌న్నాడు సాయిధ‌ర‌మ్‌తేజ్. పెళ్లిపై పెద్ద‌గా ఆస‌క్తి లేదంటూనే..అమ్మాయి న‌చ్చితే పెళ్లికి రెడీగా ఉన్నానంటూ చెప్ప‌క‌నే చెప్పాడు సాయిధ‌ర‌మ్. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.