శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 25, 2020 , 15:58:04

మాల్దీవులు కాదు మ‌హారాజ‌పురం..ఆదాశ‌ర్మ వీడియో

మాల్దీవులు కాదు మ‌హారాజ‌పురం..ఆదాశ‌ర్మ వీడియో

లాక్ డౌన్ ప్ర‌భావంతో ఇంటిపట్టునే ఉండి బోర్ డ‌మ్ గా ఫీలైన సెల‌బ్రిటీలంతా ఇపుడు త‌మ ఫేవ‌రేట్ టూరిజం స్పాట్ కు వెళ్తున్నార‌నే విష‌యం తెలిసిందే. టాలీవుడ్ స‌మంత నుంచి బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ వ‌ర‌కు మాల్దీవుల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నారు. వెకేష‌న్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు. ఇపుడు మ‌రో సెలబ్రిటీ ఆదాశ‌ర్మ‌ కూడా త‌న‌కిష్ట‌మైన ప్ర‌దేశానికి వెళ్లింది. ఇంకేముంది అంద‌రిలా ఈ భామ కూడా మాల్దీవుల‌కే వెళ్లింద‌నుకునేరు. ఆదాశర్మ ఇంక్రెడిబుల్ ఇండియా నినాదాన్ని ప్ర‌మోట్ చేస్తూ..ఇండియాలోని చారిత్ర‌క ప్ర‌దేశాల గొప్ప‌త‌నాన్ని తెలిపే ప్ర‌య‌త్నం చేస్తుంది.

తాను టూర్ కు వెళ్లింది మాల్దీవుల‌కు కాద‌ని, త‌మిళ‌నాడులోని మ‌హారాజపురం అని . ఆదాశర్మ తెలిపింది. లొకేష‌న్ లో తీసి సెల్ఫీ వీడియోను ట్విట‌ర్ లో షేర్ చేసింది. మేమంతా ఇక్క‌డికెలా వ‌చ్చామ‌ని అడ‌గొద్దు. ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ ఇంత ఎత్తైన ప్ర‌దేశానికి ఎక్కి షాట్ (వీడియో) తీయ‌లేదు. నేను చాలా అదృష్ట‌వంతురాలిని అంటూ వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చింది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.