ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 06, 2020 , 17:16:06

ప్ర‌స్తుతం కూతురితో సంతోషంగా ఉన్నా: ‌ఝాన్సీ

ప్ర‌స్తుతం కూతురితో సంతోషంగా ఉన్నా: ‌ఝాన్సీ

యాంక‌ర్ గా, న‌టిగా తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది ఝాన్సీ. టీవీ షో అయినా, సినిమా అయినా అంద‌రికీ వినోదాన్ని అందించడ‌మే త‌న మార్గంగా ఎంచుకుంది. సిల్వ‌ర్ స్ర్కీన్ పై త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకునే ఝాన్సీకి వ్య‌క్తిగ‌త జీవితంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్న‌ది.  ఓ టీవీ షోలో త‌న వైవాహిక జీవితం గురించి చెప్పుకొచ్చింది ఝాన్సీ. ఇండ‌స్ట్రీ వ్య‌క్తి అయిన తన భ‌ర్తతో ప‌లు స‌మ‌స్య‌లు వ‌చ్చి..వైవాహిక జీవితంలో మానసికంగా ఎంతో ఇబ్బంది ప‌డిన‌ట్టు చెప్పింది.

భ‌ర్త నుంచి విడాకులు తీసుకుని ప్ర‌స్తుతం త‌న కూతురితో సంతోషంగా ఉంటున్నానంది ఝాన్సీ. గ‌త కొన్నేళ్ల‌లో త‌న గురించి ర‌కర‌కాల వార్త‌లు రాశార‌ని, పుకార్ల‌న్నీ ప‌క్క‌న పెట్టి సింగిల్ లైఫ్ ను సంతోషంగా కొన‌సాగిస్తున్నాన‌ని వెల్ల‌డించింది. నటిగా మంచి పాత్ర‌ల‌తో త‌న సినీ ప్ర‌యాణం హ్యాపీ సాగుతుంద‌ని చెప్పుకొచ్చింది.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo