మంగళవారం 24 నవంబర్ 2020
Cinema - Oct 19, 2020 , 21:22:19

ఆ డాక్ట‌ర్ ద‌గ్గ‌ర డ్యాన్స్ నేర్చుకుంటా: హృతిక్ రోష‌న్

ఆ డాక్ట‌ర్ ద‌గ్గ‌ర డ్యాన్స్ నేర్చుకుంటా: హృతిక్ రోష‌న్

అసోంలో ఓ డాక్టర్‌ పీపీఈ కిట్‌, ఫేస్‌షీల్డ్‌ మాస్కు ధరించి డ్యాన్స్ చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. వార్‌ చిత్రంలో హృతిక్ రోష‌న్ డ్యాన్స్ చేసిన ‘గున్గురూ..’ పాటకు ఈ డాక్ట‌ర్ అదిరిపోయే స్టెప్పులేసి అద‌ర‌హో అనిపించాడు. ఈ వీడియోను డాక్టర్ సయ్యద్ ఫైజాన్ అహ్మద్ అనే యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయ‌గా..ఈ వీడియోకు హృతిక్ రోష‌న్ ఫిదా అయిపోయాడు. వీడియోను ట్యాగ్ చేస్తూ రీట్వీట్ చేశాడు.

 'డాక్ట‌ర్ అరూప్ తో చెప్పండి..నేను ఏదో ఒక రోజు అసోంలో అత‌ని డ్యాన్స్ స్టెప్పుల‌ను నేర్చుకుంటాను. అత‌నిలా డ్యాన్స్ చేస్తాను ' అంటూ హృతిక్ రోష‌న్ క్యాప్ష‌న్ ఇచ్చాడు. డాక్ట‌ర్ అరూప్ సేనాప‌తి స్టైలిష్ డ్యాన్స్ కు నెటిజ‌న్లు ఫిదా అయిపోతున్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.