గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 18, 2020 , 15:26:39

ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నా: ట‌్విట‌ర్ లో వ‌రుణ్ తేజ్‌

ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నా: ట‌్విట‌ర్ లో వ‌రుణ్ తేజ్‌

టాలీవుడ్ యాక్ట‌ర్ వరుణ్ తేజ్ బాక్సింగ్ నేప‌థ్యంలో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. డెబ్యూటెంట్ డైరెక్ట‌ర్ కిర‌ణ్ కొర్ర‌పాటి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. క‌న్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇవాళ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఉపేంద్ర‌కు టీం మెంబ‌ర్స్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఉపేంద్ర‌కు బ‌ర్త్ డే విషెస్ చెప్పిన వ‌రుణ్ తేజ్‌..ఉపేంద్ర‌తో క‌లిసి సినిమా కోసం ప‌ని చేసేందుకు చాలా ఎక్స‌యిటింగ్ గా ఎదురుచూస్తున్న‌ట్టు వ‌రుణ్ తేజ్ ట్విట‌ర్ లో పోస్ట్ పెట్టాడు.

వ‌రుణ్ తేజ్ ఇదివ‌ర‌కెన్న‌డూ క‌నిపించ‌ని రోల్ లో క‌నిపించ‌నుండ‌గా..ఉపేంద్ర ఎలాంటి పాత్ర‌లో క‌నిపిస్తాడో తెలియాల్సి ఉంది. అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తుండ‌గా..రేనైస్సేన్స్ ఫిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై అల్లు వెంక‌టేశ్‌, సిధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo