ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 07, 2020 , 00:23:57

ఖాళీగా ఉంటే విమర్శిస్తారు!

ఖాళీగా ఉంటే విమర్శిస్తారు!

కథానాయికగా ఎలాంటి లక్ష్యాల్ని నిర్ణయించుకోలేదని, జీవితాన్ని యథాతథంగా తీసుకోవాలన్నదే తాను నమ్మే సిద్ధాంతమని చెబుతోంది చెన్నై సొగసరి శృతిహాసన్‌. మరొకరి అంచనాలు, ఆకాంక్షలకు తగినట్లుగా తాను జీవితాన్ని సాగించలేనని, సినిమా తన జీవితంలో ఓ భాగం మాత్రమేనని పేర్కొంది. హిందీ చిత్ర పరిశ్రమలో అవకాశాలు లేనంత మాత్రాన కెరీర్‌ ముగిసినట్లు కాదని..తమిళ, తెలుగు భాషలే తన మొదటి ప్రాధాన్యత అని శృతిహాసన్‌ స్పష్టం చేసింది. ఆమె మాట్లాడుతూ ‘ముంబయిలో పరిస్థితులు విచిత్రంగా ఉంటాయి. ఏడాది పాటు ఖాళీగా ఉంటే కెరీర్‌ ముగిసిపోయిందని, అంకితభావంతో పనిచేయడం లేదని విమర్శలు చేస్తారు. నేను విభిన్న భాషల్లో సినిమాలు చేస్తున్నాను. బాలీవుడ్‌ అందులో ఒకటి మాత్రమే. నేను దక్షిణాది అమ్మాయినైనందుకు గర్విస్తాను. తమిళం, తెలుగు నాకు రెండు కళ్లతో సమానం. కెరీర్‌ విషయంలో ఎవరి సలహాలు తీసుకోను. ఆత్మసాక్షి మేరకే నడచుకుంటా. నా మనసుకు నచ్చిన సినిమాలే చేస్తుంటాను. విజయం దక్కితే సంతోషిస్తా. పరాజయం పాలైతే ఓ పాఠంగా తీసుకుంటా. అంతే కానీ కెరీర్‌కు ఏదో అవుతుందని ఆందోళన చెందను. సినిమా కాకుండా నేను ఆనందించే జీవితం చాలా ఉంది’ అని చెప్పుకొచ్చింది శృతిహాసన్‌.


logo