ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 03, 2020 , 17:52:44

నేను అజిత్ కంటే ఐదేళ్లు యంగ్ గా క‌నిపిస్తా: క‌స్తూరి

నేను అజిత్ కంటే ఐదేళ్లు యంగ్ గా క‌నిపిస్తా: క‌స్తూరి

చెన్నై: భార‌తీయుడు చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ సోద‌రిగా న‌టించిన క‌స్తూరి గుర్తుంది క‌దా. ఈ పాత్రను  తెలుగు, త‌మిళ‌, హిందీ ప్రేక్ష‌కులు ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేరు. కొన్నాళ్లుగా త‌న వ్యాఖ్య‌ల‌పై త‌మిళ‌నాట సోష‌ల్ మీడియాలో వ్యాఖ్య‌లు చేస్తూ అంద‌రి చూపు త‌న‌వైపు తిప్పుకుంది. తాజాగా ఈ న‌టి ట్రోల్స్ కు ఆస‌క్తిక‌రమైన స‌మాధాన‌మిచ్చింది. త‌న వ‌య‌స్సుపై ఓ నెటిజ‌న్ చేసిన కామెంట్‌పై క‌స్తూరి స్పందిస్తూ..తాను థ‌ల అజిత్ కంటే ఐదేళ్లు యంగ్ లుక్ లో క‌నిపిస్తాన‌ని చెప్పింది.

దీంతో ఫ్యాన్స్  క‌స్తూరి చేసిన ఈ ట్వీట్  స్క్రీన్ షాట్ ను తీసి సోష‌ల్ మీడియా ప్లాట్ ఫాంలో షేర్ చేస్తున్నారు. సినీ ఇండ‌స్ట్రీలో అజిత్ 28 ఏళ్ల ప్ర‌స్థానాన్ని పుర‌స్క‌రించుకుని వేడుక చేసుకుంటున్న స‌మ‌యంలో క‌స్తూరి చేసిన వ్యాఖ్య‌లు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo