శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 11, 2020 , 18:30:38

మీరు కూల్చేసిన ఆఫీసు నుంచే ప‌ని చేస్తా..

మీరు కూల్చేసిన ఆఫీసు నుంచే ప‌ని చేస్తా..

బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ ఆఫీసును బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎంసీ) కూల్చివేసిన విష‌యం తెలిసిందే. ధ్వంసం చేసిన ఆఫీస్ భ‌వ‌నాన్ని మ‌ళ్లీ నిర్మించుకునే స్థోమ‌త త‌న‌కు లేద‌ని, ఆ భ‌వ‌న శిథిలాల నుంచే తాను ప‌నిచేస్తాన‌ని కంగ‌నా స్ప‌ష్టం చేసింది. సోష‌ల్ మీడియా ద్వారా మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక్రే పార్టీపై విమర్శ‌లు గుప్పించారు కంగ‌నా. ఈ ఏడాది జ‌న‌వ‌రి 15న ముంబైలోని నా ఆఫీసును ప్రారంభించా. ఈ ఆఫీసు‌ను షురూ చేసిన కొన్ని రోజుల‌కే క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో నేను వృత్తిప‌ర‌మైన పనులు చేయ‌లేక‌పోయా.

మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ధ్వంసం చేసిన భ‌వనాన్ని తిరిగి నిర్మించేందుకు నా ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవు. కాబ‌ట్టి భ‌వ‌న శిథిలాల నుంచే ప‌నిచేస్తాన‌ని కంగ‌నా చెప్పారు. ప్ర‌పంచంలో అత్యున్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించాల‌ని ధైర్య‌సాహ‌సాలు క‌లిగిన స్త్రీ సంక‌ల్పానికి గుర్తుగా ఈ ఆఫీసు ఉంటుందని కంగ‌నా పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు