సోమవారం 18 జనవరి 2021
Cinema - Nov 30, 2020 , 13:06:42

నా నిర్ణ‌యాన్ని త‌ర్వ‌లోనే ప్ర‌క‌టిస్తాను: ర‌జ‌నీకాంత్

నా నిర్ణ‌యాన్ని త‌ర్వ‌లోనే ప్ర‌క‌టిస్తాను: ర‌జ‌నీకాంత్

సూపర్ స్టార్ ర‌జనీకాంత్ పొలిటికల్ వ్య‌వ‌హారం మ‌రోసారి సస్పెన్స్‌గానే మిగిలింది. ఈ రోజు ఉద‌యం రజనీ మక్కల్‌ మండ్రం ముఖ్య నిర్వాహకులు, జిల్లాల కార్యదర్శులతో  రాఘవేంద్ర కల్యాణ మండపం వేదికగా భేటీ అయ్యారు ర‌జ‌నీకాంత్‌. ఒక‌రి అభిప్రాయాలు ఒక‌రు షేర్ చేసుకున్నారు. స‌మావేశం ముగిసిన త‌ర్వాత మీడియాతో మాట్లాడిన ర‌జ‌నీకాంత్.. నేను ఏ నిర్ణ‌యం తీసుకున్నా కూడా వారు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. త్వ‌ర‌లో నా నిర్ణ‌యం ఏంట‌నేది ప్ర‌క‌టిస్తాను అని ర‌జ‌నీకాంత్ స్ప‌ష్టం చేశారు. అలానే   రాఘవేంద్ర హాల్ బ‌య‌ట ఉన్ త‌న  మద్దతుదారులను పలకరించారు ర‌జ‌నీకాంత్. ఇక సినిమాల  విష‌యానికి వ‌స్తే ఆయ‌న అన్నాత్తే అనే చిత్రంతో బిజీగా ఉన్నారు.ఫిబ్ర‌వ‌రిలో చిత్ర షూటింగ్ మొద‌లు కానుంది.