మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 06, 2020 , 15:47:47

ఎప్ప‌టికీ సింగిల్ గా ఉంటానంటున్న ప్ర‌ముఖ గాయ‌ని

ఎప్ప‌టికీ సింగిల్ గా ఉంటానంటున్న ప్ర‌ముఖ గాయ‌ని

త‌న గాత్రంతో ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు ప్ర‌ముఖ గాయ‌ని సునీత‌. వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించి ఎలాంటి పుకార్లు వ‌చ్చినా లెక్క‌చేయ‌కుండా విజ‌య‌వంతంగా త‌న కెరీర్ ను కొన‌సాగిస్తున్నారు. ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్య్వ్యూలో త‌న రిలేష‌న్ షిప్ స్టేట‌స్ గురించి చెప్పారు. చాలా ఏండ్ల క్రితం త‌న భ‌ర్త‌తో విడాకులు తీసుకున్న త‌ర్వాత మ‌ళ్లీ ఒంట‌రిగా జీవితాన్ని గ‌డుపుతున్న‌ట్టు చెప్పారు. అంతేకాదు సింగిల్ మ‌ద‌ర్ గానే త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌ బాగోగులు చూసుకుంటున్నాన‌న్నారు.

పుకార్లతో త‌న‌కెలాంటి ఇబ్బంది లేద‌ని, త‌న కుటుంబానికి వాస్త‌వాలేంటో తెలుసున‌న్నారు. తాను ఎప్పటికీ సింగిల్ గానే ఉంటాన‌ని చెప్పుకొచ్చారు. చాలా చిన్న వ‌య‌స్సులోనే పెళ్లి చేసుకున్న సునీత‌ మ‌ళ్లీ పెళ్లి చేసుకోలేదు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo