శనివారం 30 మే 2020
Cinema - May 20, 2020 , 16:30:30

బ్రదర్ నీకు తప్పకుండా రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తా: రాంచరణ్‌

బ్రదర్ నీకు తప్పకుండా రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తా: రాంచరణ్‌

హైదరాబాద్‌: నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న టాలీవుడ్‌ యాక్టర్‌ ఎన్టీఆర్‌కు కోస్టార్‌ రాంచరణ్‌ శుభాకాంక్షలు తెలియజేశాడు. నా ప్రియమైన సోదరుడు తారక్‌కు జన్మదిన శుభాకాంక్షలు. పుట్టినరోజు సందర్భంగా నీకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని తెలుసు. ఖచ్చితంగా నీకు అద్భుతమైన కానుక ఇస్తాను. మరిన్ని వేడుకల కోసం ఎదురుచూస్తున్నానని రాంచరణ్‌ ట్వీట్‌ చేశాడు.

ఇటీవలే రాంచరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ..సర్ ఫ్రైజ్ కానుకగా ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి అల్లూరి సీతారామరాజు ఫస్ట్‌ లుక్‌ వీడియోను ఎన్టీఆర్ విడుదల చేసిన విషయం తెలిసిందే.


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo