ఆదివారం 01 నవంబర్ 2020
Cinema - Oct 01, 2020 , 19:25:26

ఇక నుండి ఏడాదికి రెండు సినిమాలు చేస్తా‌

ఇక నుండి ఏడాదికి రెండు సినిమాలు చేస్తా‌

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సానా క్రియేషన్స్ బ్యానర్ పై  సానా యాదిరెడ్డి దర్శక నిర్మాతగా తెర‌కెక్కించిన‌  'పిట్టల దొర' , బ్యాచిలర్స్, సంపంగి, ప్రేమ పల్లకి,  జై బజరంగభళి, కుచ్ కుచ్ కూనమ్మా వంటి స్మాల్ బడ్జెట్ తో తీసిన మూవీస్ మ్యూజికల్ గా పెద్ద సక్సెస్ లు సాధించిన విష‌యం తెలిసిందే.. ప్ర‌స్తుతం ఆయ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం 'నువ్వంటే నేనని` 2014లో జరిగిన  ఓ యదార్ధ సంఘటనని ఆధారం చేసుకుని సరికొత్త ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అక్టోబ‌ర్‌ 2 ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా దర్శక నిర్మాత సానా యాది రెడ్డి చెప్పిన విశేషాలు..

సంవ‌త్స‌రానికి రెండు సినిమాలు

ఇంత‌కాలం సినిమాల‌కి కొంత విరామం ఇచ్చి నా బిజినెస్‌, రియ‌ల్ ఎస్టేట్ కి న్యాయవాద వృత్తి  సంబంధించిన ప‌నులు చూసుకోవ‌డం జ‌రిగింది. ఇకపై అవి చూసుకుంటూనే  2021 నుండి త‌ప్ప‌కుండా సంవ‌త్స‌రానికి రెండుకి త‌గ్గ‌కుండా సినిమాలు మా బేన‌ర్ లో చేయాల‌ని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇంత‌కు ముందు సినిమాల‌ను హాబీగా తీసుకుని నా బిజినెస్‌లు చూసుకుంటూ సంవ‌త్స‌రానికి ఒక‌టి రెండు సినిమాలు తీసుకుంటూ వ‌చ్చాను. అయితే ఇక నుండి సినిమాల‌ని ఒక ప్రొఫెష‌న్‌గా తీసుకుని ఏడాదికి రెండు సినిమాలు చేస్తాను. ఇప్ప‌టికే దానికి సంబందించిన ప‌నులు మొద‌లుపెట్టాం. కొన్ని స‌బ్జెక్ట్స్ డిస్క‌ర్ష‌న్స్ జ‌రుగుతున్నాయి మ‌రికొన్నిలాక్ చేసి పెట్టాం. ఇక పై ఫుల్ ఫ్లెజ్డ్‌గా సినిమాలపై దృష్టిపెట్టాను. త్వ‌ర‌లోనే స్టార్ హీరోల‌తో పెద్ద‌ సినిమాలు కూడా నిర్మిస్తాం.

ఫీల్ గుడ్ మూవీగా 'నువ్వంటే నేనని'

- 2004 హైదరాబాద్ లో మాకు చాలా ద‌గ్గ‌రివాళ్ల‌కు జరిగిన ఓ యదార్ధ సంఘటనని  ఆధారం చేసుకుని దానికి కొన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి నూత‌న న‌టీన‌టుల‌తో ఒక ఫీల్ గుడ్ మూవీగా 'నువ్వంటే నేనని` చిత్రాన్ని రూపొందించాను. ట్రెండీగా ఉంటూనే ఫ్యామిలీ అంతా క‌లిసి చూడ‌ద‌గ్గ చిత్రం. నేటిత‌రం యువ‌తీ యువ‌కుల‌కు ఒక ఇన్స్‌పిరేష‌న్ గా ఉంటుంది. ప్ర‌తి ప్రేమ స్నేహంతోనే మొద‌లైనా.. `నిజ‌మైన నిండైన జీవితానికి  ప్రేమ, స్నేహం రెండు అవ‌స‌ర‌మే` అని అంత‌ర్లీనంగా ఒక‌ మంచి సందేశం ఉంటుంది. నేను తెర‌కెక్కించిన సంపంగి మూవీ కంటే ఈ మూవీలో ఇంకో ప‌దిరెట్లు ఎక్కువ ఫీల్ ఉంటుంది.పాటలు హైలెట్ గా నిలుస్తాయి

వరికుప్పల యాదగిరిని పాటల రచయితగా నా చిత్రాల ద్వారానే  పరిచయం చేశాను. ఇప్పుడు ఈ చిత్రంతో అతన్ని మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ సినిమాకి అతని పాటలు ఓ హైలెట్ గా నిలుస్తాయి. ప్ర‌ముఖ సింగ‌ర్ సిద్ శ్రీ‌రామ్ ఒక పాట పాడ‌డం జ‌రిగింది. ఆ పాట చాలా బాగా వ‌చ్చింది త్వ‌ర‌లోనే  విడుద‌ల చేస్తాం. లిరిక‌ల్ వ్యాల్యూ బాగుంటేనే ఒక పాట బాగుంటుంద‌ని నేను న‌మ్ముతాను. అందుకే నా ప్ర‌తి సినిమాలో పాటల‌ ద్వారా క‌థ‌ని చెప్పే ప్ర‌య‌త్న‌మే చేశాను.  సినిమాలో  ఐదు పాట‌లు ఉన్నాయి. అన్ని పాట‌లు సాహిత్య‌ప‌రంగా ఆక‌ట్టుకుంటాయి. 

ప్ర‌తి ఒక్క‌రికీ న‌చ్చుతుంది.

ఈ సమయంలో మల్టి ఫ్లెక్సులు ఓపెన్ చేసినా ఆడియ‌న్స్‌ వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ. అందుకే నేరుగా ఇంట్లోనే కుటుంబ సమేతంగా చూసే విధంగా ఓ ప్ర‌ముఖ‌ ఓటిటి ద్వారా విడుదల చేయాలనుకుంటున్నాను. ఇప్ప‌టికే కొంత మంది సినీ ప్ర‌ముఖుల‌కి సినిమా చూపించ‌డం జ‌రిగింది. వారంద‌రికీ సినిమా చాలా బాగా న‌చ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో లేచి నిల్చొని క్లాప్స్ కొట్టారు. దాంతో సినిమా తప్ప‌కుండా ప్ర‌తి ఒక్క‌రికీ న‌చ్చుతుంద‌ని న‌మ్మ‌కం క‌లిగింది. ట్రెండీ సినిమాలే చేశాను..

టెక్నిక‌ల్‌గా ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ అవుతూనే ఉంటాను. నేను ఇంత‌కు ముందు చేసిన సినిమాలు కూడా ట్రెండీగానే ఉంటాయి. హిందూ ముస్లీం భాయిభాయి అనే కాన్సెప్ట్‌తో సంపంగి సినిమా తీశాను. అలాగే బ్యాచిలర్స్  మ‌నిషి జీవితం గురించి తెలియ‌జెప్పే చిత్రం. ఒక జాన‌ప‌థ క‌ళాకారుని జీవితం ఆదారంగా 'పిట్టల దొర`, ఫాంట‌సీ ఎలిమెంట్స్‌తో గ్రాఫిక్స్ లేని కాలంలోనే  `జై బజరంగభళి` వంటి సినిమా తీశాను. అలాగే మంచి మ్యూజిక‌ల్ బ్యాక్‌డ్రాప్ తో ప్రేమ ప‌ల్ల‌కి సినిమా ఇలా ఒక‌దానితో ఒక‌టి సంబందం లేకుండా వేరు వేరు జోనర్స్‌లో సినిమాలు తీశాను. ఇప్పడు మళ్లీ నూతన హీరో హీరోయిన్లతోనే  'నువ్వంటే నేనని'  చిత్రాన్ని నిర్మించాను.

ఈ క‌రోనా కార‌ణంగా పుట్టిన‌రోజు కార్య‌క్ర‌మాల‌ను ఇంటికే ప‌రిమితం చేస్తున్నాను.  నా గత చిత్రాలను ప్రేక్ష‌కులు చాలా బాగా  ఆదరించారు. అదే విధంగా నా తాజా చిత్రం 'నువ్వంటే నేనని' ని కూడా చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను అంటూ ఇంట‌ర్వ్యూ ముగించారు. 

నటీనటులు : నకుల్, శ్వేతా (నూతన  పరిచయం) చంద్ర మోహన్, దువ్వాసి మోహన్, 'చిత్రం' శ్రీను  తదితరులు  

సాంకేతిక నిపుణులు:

కథ: పరమేష్ - రామ్ కుమార్,

మాటలు: పోలూరు ఘటికా చలం

కెమెరామెన్: విజయ్. సి .కుమార్,

పాటలు, సంగీతం: వరికుప్పల యాదగిరి

ఎడిటర్: రమేష్,

డాన్స్: స్వర్ణ - దివ్య

ఫైట్స్: రామ్  లక్ష్మణ్ 

పి ఆర్ ఓ: రాంబాబు వర్మ  

సమర్పణ : సానా నిఖిలేష్ రెడ్డి 

కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సానా  యాదిరెడ్డి

నిర్మాణం; సానా క్రియేషన్స్  
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.