గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Oct 02, 2020 , 10:06:13

నా లోపాలే.. నా అందం : ఇలియానా

నా లోపాలే.. నా అందం : ఇలియానా

హైద‌రాబాద్‌: ఇలియానా త‌న అందాల‌ను ఆర‌బోసింది. పోకిరి పిల్ల త‌న వంటి వొంపులు ఎలా ఉంటాయో చెప్పింది.  అందంగా లేనంటూనే త‌న శ‌రీర సౌష్ఠ‌వాన్ని తెగ మెచ్చుకున్న‌ది.  ఇలియానా షేప్ అంత అట్రాక్టివ్‌గా ఉండ‌ద‌ని కొన్నాళ్ల క్రితం బాడీషేమింగ్ జ‌రిగిన విష‌యం తెలిసిందే.  ఆ ఘ‌ట‌న త‌ర్వాత ఆమె కొంత డిప్రెష‌న్‌కు లోనైంది. కానీ ఇప్పుడు ఆ సీన్ మారిన‌ట్లు త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్ప‌క‌నే చెప్పిందామె.  త‌న శ‌రీరంలోని ప్ర‌తి అవ‌యం ఎలా ఉంటుందో.. ఇన్‌స్టాలో ఇలియానా తేట‌తెల్లంగా వివ‌రించింది. తాజాగా దిగిన బ్లాక్ అండ్ వైట్ క‌ల‌ర్ ఫోటోను పోస్టు చేసింది.  లోపాలు ఉన్న‌ట్లు బాధ‌ప‌డినా.. ఆ లోపాలే ఆమెకు అందాలంటూ కామెంట్ చేసింది.  ఎత్తులేన‌ని, ఎద‌గ‌లేద‌ని, ప‌ర్ఫెక్ట్‌గా లేన‌ని ఆరోప‌ణ‌లు ఉన్నా.. త‌న అందాల‌న్నీ అద్భుత లోపాల‌న్న‌ట్లు ఇలియానా త‌న ఇన్‌స్టాలో పోస్టు చేసింది.  శ‌రీరంలోని ప్ర‌తి చిన్న లోపం త‌న‌ను మ‌రీ మ‌రీ అందంగా మ‌లిచిన‌ట్లు ఒప్పేసుకున్న‌ది. అందుకే బ్యూటీ గురించి మాట్లాడ‌డం మానేసాన‌ని, మ‌రీ ఫిట్‌గా ఉండాల‌న్న త‌ప‌న కూడా లేద‌ని, త‌న స‌హ‌జ‌సిద్ధ‌మైన అందాలే త‌న‌కు అట్రాక్ష‌న్ అని ఇలియానా త‌న పోస్టులో వివ‌రించింది. 


  

View this post on Instagram

I’ve always worried about how I looked. I’ve worried my hips are too wide, my thighs too wobbly, my waist not narrow enough, my tummy not flat enough, my boobs not big enough, my butt too big, my arms too jiggly, nose not straight enough, lips not full enough..... I’ve worried that I’m not tall enough, not pretty enough, not funny enough, not smart enough, not “perfect” enough. Not realising I was never meant to be perfect. I was meant to be beautifully flawed. Different. Quirky. Unique. Every scar, every bump, every “flaw” just made me, me. My own kind of beautiful. That’s why I’ve stopped. Stopped trying to conform to the world’s ideals of what’s meant to be beautiful. I’ve stopped trying so hard to fit in. Why should I?? When I was born to stand out. #nophotoshop #nobs ???? @colstonjulian

A post shared by Ileana D'Cruz (@ileana_official) on


logo