శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 29, 2020 , 16:44:19

క‌ల‌ర్ ఫొటో లాంటి సినిమా చేయాలి: జ‌గ‌ప‌తిబాబు

క‌ల‌ర్ ఫొటో లాంటి సినిమా చేయాలి: జ‌గ‌ప‌తిబాబు

త‌నదైన యాక్టింగ్‌, డైలాగ్ డెలివ‌రీ తో క్లాస్‌, మాస్ ప్రేక్ష‌కాభిమానుల‌ను సంపాదించుకున్నాడు టాలీవుడ్ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు. లెజెండ్ సినిమాతో నెగెటివ్ షేడ్స్ లో న‌టించిన జ‌గ్గూభాయ్‌ పాత్ర‌కు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిసింది. సుహాస్, చాందినీ చౌద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన చిత్రం క‌ల‌ర్ ఫొటో. ఇటీవ‌లే విడుద‌లైన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమ‌క‌థ‌ను ప్రేక్ష‌కుల మ‌న‌స్సుకు హ‌త్తుకునేలా తీశాడు డైరెక్ట‌ర్‌. ఈ చిత్రంపై జ‌గ‌ప‌తిబాబు ప్ర‌శంస‌లు కురిపించాడు. 

క‌ల‌ర్ ఫొటో చూశాక సంతోషంగా ఫీల‌య్యా. సుహాస్ హీరోగా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు. డైరెక్ట‌ర్ ఈ వ‌య‌స్సులోనే మంచి సినిమా తీశాడు. కాల భైర‌వ మ్యూజిక్ కు చాలా ఇంప్రెస్ అయ్యా. డ‌బ్బులు..స్టార్ డ‌మ్ ఈ సినిమాను హిట్ చేయలేదు. అంద‌రి మ‌న‌స్సుకు హ‌త్తుకుపోయేలా గొప్ప‌గా ఉండ‌టం వల్లే సాధ్య‌మైంది. యువ‌న‌టీన‌టులు త‌మ క్రియేటివిటీతో స‌హ‌జ‌సిద్దంగా ఇలా సినిమా చేయగ‌లిగార‌ని చాలా సార్లు నేను ఆశ్చ‌ర్య‌పోయాన‌ని  ట్వీట్ చేశారు. 

ఇలాంటి చిత్రాల్లో న‌టించడం నాకు చాలా ఇష్టం. చాలా మంది త‌న‌ను ‌డ‌బ్బు ట్యాగ్ తో న‌న్ను సంప్ర‌దించార‌ని.. లేదా చిన్న హీరో సినిమాలో ఇలాంటి పాత్ర చేస్తానా..? అని అనుకొని ఉండొచ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు జ‌గ్గూభాయ్‌. కాలాన్ని మార్చే ఇలాంటి గొప్ప సినిమాల్లో తాను న‌టిస్తాన‌ని చెప్పుకొచ్చారు జ‌గ‌ప‌తిబాబు. మ‌రి ఇప్ప‌టికైనా డైరెక్ట‌ర్లు మంచి క‌థ‌తో త‌న‌ను సంప్ర‌దిస్తే జ‌గ‌ప‌తిబాబు ఓకే చెప్తాన‌డంలో ఎలాంటి సందేహం లేద‌నిపిస్తోంది. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.