శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 20, 2020 , 19:09:52

పోలీసాఫీస‌ర్ అవ్వాల‌ని ఉండేది: సాయికుమార్

పోలీసాఫీస‌ర్ అవ్వాల‌ని ఉండేది: సాయికుమార్

శ‌ర్వానంద్ హీరోగా న‌టిస్తోన్న శ్రీకారం చిత్ర‌షూటింగ్ తిరుప‌తి ప‌రిస‌రాల్లో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. సినిమా షూటింగ్ కోసం అక్క‌డే ఉన్న సాయికుమార్ విరామ స‌మ‌యంలో ఇవాళ తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ ద‌ర్శ‌న స‌మ‌యంలో స్వామివారి సేవ‌లో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు సాయికుమార్ దంపతుల‌కు ద‌ర్శ‌న ఏర్పాట్లు చేసి..వారికి స్వామివారి తీర్థ‌ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు.

అనంత‌రం సాయికుమార్ మీడియాతో మాట్లాడుతూ..శ‌ర్వానంద్ హీరోగా న‌టిస్తున్న శ్రీకారం క‌రోనా ప్ర‌భావంతో నిలిచిపోయి..మ‌ళ్లీ మొద‌లైంద‌న్నారు. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు ఇక్క‌డికి వచ్చాన‌న్నారు. తాను న‌టించిన పోలీస్ స్టోరీ చిత్రం రేప‌టితో 24 ఏండ్లు పూర్తి చేసుకుంటుంద‌ని సాయికుమార్ అన్నారు. త‌న‌కు పోలీసాఫీస‌ర్ అవ్వాల‌నే కోరిక ఉండేద‌ని చెప్పారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.