శనివారం 28 నవంబర్ 2020
Cinema - Oct 27, 2020 , 21:23:51

డాక్ట‌ర్ కావాల‌నుకున్నా..కానీ: మానుషి చిల్లార్

డాక్ట‌ర్ కావాల‌నుకున్నా..కానీ: మానుషి చిల్లార్

2017లో మిస్ వ‌రల్డ్ కిరీటాన్ని ద‌క్కించుకుని ఇండియాకు పేరు ప్ర‌ఖ్యాతులు తీసుకొచ్చింది హ‌ర్యానా సోయ‌గం మానుషి ఛిల్లార్. ఈ మోడ‌ల్ అక్ష‌య్ కుమార్ తో క‌లిసి పృథ్విరాజ్ చిత్రంతో సిల్వ‌ర్ స్క్రీన్ కు ప‌రిచ‌యం కానుంది. ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ జ‌రుపుకుంటోంది. మానుషి ఓ ఇంట‌ర్వ్యూలో కొన్ని విష‌యాలు షేర్ చేసుకుంది. త‌న స్వ‌స్థ‌లం హ‌ర్యానాను విడిచిపెట్టి ముంబైకి రావ‌డం కొత్త అనుభూతి అని చెప్పింది.

నేను డాక్ట‌ర్ కావాల‌నుకు‌న్నా. అందాల పోటీల్లో పాల్గొనేకంటే ముందు ఒక్క‌సారి కూడా ముంబైకి రాలేదు. కొన్నేళ్ల ముందు ముంబై నాకు కొత్త‌. సిటీలో నాకు ఎవ్వ‌రూ తెలియ‌దు. కానీ ఇపుడు ముంబైను నా హోమ్ టౌన్ గా చెప్పుకుంటున్నా. మూడేళ్ల‌లో ముంబైతో ఇలాంటి అనుబంధం ఏర్ప‌డ‌టం మ్యాజిక్ లాగా అనిపిస్తుంది. డాక్ట‌ర్ కావాల‌నుకున్న నేను..సంబంధం లేని రంగంలోకి వ‌చ్చి ఇపుడు న‌ట‌న‌తో మీ ముందుకొస్తున్నాన‌ని చెప్పుకొచ్చింది. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.