గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 03, 2020 , 11:04:07

డైరెక్ట‌ర్ ను క‌లిసే దాకా తెర‌పై రొమాన్స్ క‌ష్ట‌మ‌నుకున్నా

డైరెక్ట‌ర్ ను క‌లిసే దాకా తెర‌పై రొమాన్స్ క‌ష్ట‌మ‌నుకున్నా

టాలీవుడ్ అందాల తార స‌మంత యాక్టింగ్ స్కిల్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. గ్లామ‌ర్ రోల్ అయినా, సీరియ‌స్ పాత్ర‌లోనైనా సుల‌భంగా ఒదిగిపోగ‌ల న‌టి. గౌత‌మ్ మీన‌న్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కిన ఏ మాయ చేశావే చిత్రంతో అంద‌రి మ‌న‌సులు దోచేసింది సామ్‌. ఈ బ్యూటీ తాజాగా సోష‌ల్ మీడియాలో ఆస్క్ మీ సెష‌న్ లో పాల్గొంది. ఓ నెటిజ‌న్ ప్ర‌శ్న‌కు స‌మాధానమిస్తూ తెర‌పై రొమాన్స్ పండించ‌టం చాలా క‌ష్ట‌మ‌ని డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్ ను క‌లిసే వ‌ర‌కు అనుకున్నా.

అంతేకాదు డైరెక్ట‌ర్ నందినీరెడ్డిని వ‌ర‌కు కామెడీ పండించ‌టం కూడా క‌ష్ట‌మ‌నుకున్నా. ప్ర‌స్తుతం ఎలాంటి పాత్ర చేయాల‌న్నా నాకు భయమ‌నేది లేదని స‌మంత చెప్పుకొచ్చింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo