శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 23, 2020 , 19:39:58

బాహుబ‌లి సినిమాకు తైవాన్ మంత్రి ఫిదా..వీడియో

బాహుబ‌లి సినిమాకు తైవాన్ మంత్రి ఫిదా..వీడియో

టాలీవుడ్ డైరెక్ట‌ర్ ఎస్ ఎస్ రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం బాహుబ‌లి. ఈ సినిమా ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌లై రికార్డుల మోత మోగించింది. భార‌తీయ భాష‌ల్లోనే కాకుండా విదేశీ భాష‌ల్లో కూడా విడుద‌లై క‌లెక్ష‌న్ల సునామి సృష్టించింది. బాహుబ‌లి సినిమా అంటే ఇష్ట‌ప‌డ‌ని ప్రేక్ష‌కులుండ‌రంటే అతిశయోక్తి కాదు. బాహుబ‌లి చిత్రానికి  తైవాన్ (రిప‌బ్లిక్ ఆఫ్ చైనా) విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి జోసెఫ్ వూ ఫిదా అయిపోయారు.

ఓ ఛాన‌ల్ డిస్క‌ష‌న్ లో జోసెఫ్ వూ మాట్లాడుతూ.. బాహుబ‌లి త‌న ఫేవ‌రేట్ చిత్రమ‌ని చెప్పారు. ప్ర‌తీసారి నేను టీవీలో బాహుబ‌లి సినిమా చూస్తుంటాను. సినిమా చూసేట‌పుడు ఛాన‌ల్ మార్చ‌వ‌ద్ద‌ని నా భార్య చెప్తా. ఎందుకంటే నాకు బాహుబ‌లి సినిమా మ‌ళ్లీమ‌ళ్లీ చూడాల‌నిపిస్తుంది. నేను ఎన్నిసార్లు బాహుబ‌లి చిత్రాన్ని చూశానో నాకు తెలియ‌దు. ఇండియ‌న్ సినిమా చూడ‌టం చాలా స‌ర‌దాగా ఉంటుంద‌ని జోసెఫ్ వూ చెప్పుకొచ్చారు. అంతేకాదు అమీర్ ఖాన్ న‌టించిన దంగ‌ల్‌, హిందీ మీడియం చిత్రాలంటే కూడా త‌నకు ఇష్ట‌మ‌ని చెప్పారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.