శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 06, 2020 , 19:18:37

నేను డ్ర‌గ్స్ కొన్న‌ది నిజ‌మే..కానీ: రియా చ‌క్ర‌వ‌ర్తి

నేను డ్ర‌గ్స్ కొన్న‌ది నిజ‌మే..కానీ:  రియా చ‌క్ర‌వ‌ర్తి

ముంబై: బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌ మృతి కేసులో అత‌ని గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తిని విచారించ‌గా..డ్ర‌గ్స్ కోణం వెలుగులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ మేరకు ఎన్‌సీబీ (నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో) అధికారులు రియా చ‌క్ర‌వ‌ర్తికి స‌మ‌న్లు కూడా జారీచేశారు. దీంతో ఇవాళ మ‌ధ్యాహ్నం రియా ఎన్‌సీబీ ఆఫీసుకు చేరుకున్నారు. విచార‌ణ‌లో రియా చ‌క్ర‌వ‌ర్తి తాను డ్ర‌గ్స్ కొనుగోలు చేసింది నిజ‌మేన‌ని ఎన్‌సీబీ అధికారుల‌కు చెప్పింది అయితే తాను మ‌త్తు ప‌దార్థాల‌ను మాత్రం వినియోగించ‌లేద‌ని వెల్ల‌డించింది.

డ్ర‌గ్స్ కేసుకు సంబంధించి రియాతోపాటు మ‌రో 28 మందిని విచారించాల్సి ఉంద‌ని ఎన్‌సీబీ అధికారులు తెలిపారు. త‌న క్ల‌యింట్ రియా చ‌క్ర‌వ‌ర్తి అరెస్ట్ చేసేందుకు అధికారులు సిద్దంగా ఉన్నార‌ని, రియా ముంద‌స్తు బెయిల్ కు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోలేద‌ని ఆమె త‌ర‌పు న్యాయ‌వాది స‌తీశ్ మాన్ షిండే తెలిపారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo