గురువారం 28 మే 2020
Cinema - Apr 24, 2020 , 21:26:04

ఇంట్లో మార్ష‌ల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నా..

ఇంట్లో మార్ష‌ల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నా..

క‌న్నడ స్టార్ యాక్టర్ పునీత్ రాజ్ కుమార్ శాండ‌ల్ వుడ్ టాప్ స్టార్ల‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ నటుడు లాక్ డౌన్ నేప‌థ్యంలో హోం క్వారంటైన్ కు ప‌రిమితమ‌య్యాడు. లాక్ డౌన్ లో ఏం చేస్తున్నాడ‌నే విష‌యంపై మీడియాతో చిట్ చాట్ చేశాడు.

నేను ఫిట్ గా ఉండేందుకు మార్ష‌ల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. యోగాస‌నాలు వేస్తున్నా. ప్ర‌త్యేకించి డైట్ అంటూ ఏం అనుస‌రించ‌డం లేదు. 2-3 కిలోల త‌గ్గి..లాక్ డౌన్ పూర్త‌యే స‌రికి ఫిట్ గా క‌నిపించాల‌నుకుంటున్నా. వంట చేయాలంటే ఎంత ఓపిక ఉండాలో నాకు ఇప్ప‌టివ‌ర‌కు తెలియ‌దు. కానీ ఇపుడు మాత్రం ఆ క‌ష్టాలేంటో ఇంట్లో ఉంటే తెలుస్తున్నాయి. నా కూతుళ్లు ఇంట్లోనే ఉండి సినిమాలు, వెబ్ సిరీస్, షోలు చూస్తూ టైంపాస్ చేస్తున్నారు. ఇంట్లో పాత ఆట‌లైన క్యార‌మ్, మోనోపొలీ, లుడోను ఆడుతున్నాం. పాత ఆల్బ‌మ్ లు బ‌య‌ట‌కు తీసి అప్ప‌టి మ‌ధుర జ్ఞాప‌కాలు గుర్తు చేసుకుంటున్నామ‌ని చెప్పుకొచ్చాడు. 
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo