బుధవారం 27 మే 2020
Cinema - May 01, 2020 , 09:26:59

ఆసుప‌త్రిలో ఉన్న‌ప్పుడు రిషీని ఒక్క‌సారి చూడ‌లేదు: అమితాబ్

ఆసుప‌త్రిలో ఉన్న‌ప్పుడు రిషీని ఒక్క‌సారి చూడ‌లేదు: అమితాబ్

బాలీవుడ్ స్టార్ రిషీ క‌పూర్ గురువారం క‌న్ను మూసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణాన్ని సోష‌ల్ మీడియా ద్వారా క‌న్‌ఫాం చేశారు అమితాబ్ బ‌చ్చ‌న్‌. రిషీ క‌పూర్ మ‌ర‌ణానికి సంబంధించి ట్వీట్ చేయ‌లేక డిలీట్ చేశారు అమితాబ్. అలాంటి ప‌రిస్థితుల‌లో త‌న స్నేహితుడిని చూడ‌లేక అంత్య‌క్రియ‌ల‌కి కూడా హాజ‌రు కాలేదు. అమితాబ్ బ‌దులుగా అతని కుమారుడు అభిషేక్ అంత్య‌క్రియ‌ల‌లో పాల్గొన్నారు. 

రిషి కపూర్ మరియు అమితాబ్ బచ్చన్.. కబీ కబీ, అమర్ అక్బర్ ఆంథోనీ , 102 నాట్ అవుట్ ఇలా ప‌లు సినిమాలు కలిసి  చేశారు. రిషీ క‌పూర్ మ‌ర‌ణంతో వీరిద్ద‌రి మ‌ధ్య బంధానికి బ్రేక్ ప‌డ‌డంతో బిగ్ బీ.. తన పోస్ట్‌లో  మిస్టర్ కపూర్‌తో తన తొలి సమావేశాల గురించి, ఆర్కె స్టూడియోలో గడిపిన సంద‌ర్భాల గురించి రాశారు.  రిషి కపూర్ నడక, అతని డైలాగ్ డెలివరీ, లిప్-సింకింగ్ , సెన్స్ ఆఫ్ హ్యూమ‌ర్ అద్భుతం అని  గురించి రాశాడు. 

అయితే ఆసుపత్రిలో ఉన్నప్పుడు తాను ఎప్పుడూ రిషి కపూర్‌ను చూడ‌డానికి వెళ్ల‌లేద‌ని అమితాబ్ బచ్చన్  వెల్లడించాడు. ఎప్పుడు మంద‌హాసంతో ఉండే అత‌ని ముఖంపై  నేను ఎప్పుడూ బాధను చూడాలని అనుకోలేదు" అని బిగ్ బి తన పోస్ట్‌లో రాశాడు. అత‌ని చివ‌రి క్ష‌ణాల‌లో కూడా ముఖంపై  చిరునవ్వు ఉండి ఉంటుంద‌ని నేను భావిస్తున్నాను అని బిగ్ బీ పేర్కోన్నారు 


logo