శనివారం 30 మే 2020
Cinema - May 19, 2020 , 17:37:18

నాన్న మిమ్మల్ని ప్రతీ రోజు మిస్సవుతున్నా...

నాన్న మిమ్మల్ని ప్రతీ రోజు మిస్సవుతున్నా...

బాలీవుడ్‌ నటి భూమి పెడ్నేకర్‌ తన తండ్రి సతీశ్‌ పెడ్నేకర్‌ జయంతి సందర్భంగా భావోద్వేగపూరితమైన సందేశాన్ని పోస్ట్‌ చేసింది. సతీశ్‌ పెడ్నేకర్‌ చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఫొటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ చేసింది భూమి.

"మిమ్మల్ని ప్రతీ రోజూ మిస్సవుతున్నా. ప్రతీ క్షణం మీరే గుర్తొస్తారు. అప్పటి నుంచి నన్ను నేను ఎక్కడ చూసుకున్నా..మీరే కనిపిస్తుంటారు. నా కండ్లు మీలాగే కనిపిస్తాయి. ప్రతీ రోజు ఉదయాన్నే నన్ను నిద్రలేపి కరేలా జ్యూస్‌ తాగమని చెప్పేవారు. పరీక్షల సమయంలో ప్రతీ రోజు రాత్రి మీరూ నా పక్కనే ఉండేవారు. ప్రతీసారి మీ చేతులతో నాకు తినిపించారు. ప్రతీ రోజు నన్ను స్కూల్‌కు తీసుకెళ్లి..మళ్లీ తీసుకొచ్చేవారు. గణేశ్ చతుర్థి, ఈద్‌ వంటి ప్రత్యేక సమయాల్లో నాన్న మీరు లేని లోటు తీర్చలేనిది. ప్రతీ సారి నేను తప్పులు చేయకుండా చూసుకుంటూ మంచి, గొప్పగా ఎలా నడుచుకోవాలో చెప్పేవారంటూ" సందేశాన్ని పోస్ట్‌ చేసింది. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo