శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 17, 2021 , 17:06:28

తెలుగు సినీప‌రిశ్ర‌మ అంటే చాలా ఇష్టం: సోనూసూద్‌

తెలుగు సినీప‌రిశ్ర‌మ అంటే చాలా ఇష్టం: సోనూసూద్‌

తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో త‌న విల‌నిజంతో ప్రేక్ష‌కుల‌ను  మెప్పించాడు బాలీవుడ్ న‌టుడు సోనూసూద్‌. ఈ యాక్ట‌ర్ తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా న‌టించిన అల్లుడు అదుర్స్ చిత్రంలో కీ రోల్ పోషించాడు. సోనూసూద్ పాత్ర‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ చిత్రం మంచి టాక్ తో ప్రద‌ర్శించ‌బ‌డుతోంది. ఈ సంద‌ర్బంగా హైద‌రాబాద్ లో  చిత్ర‌యూనిట్ స‌క్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ సంద‌ర్భంగా సోనూసూద్ తెలుగు సినీ ప‌రిశ్ర‌మంటే త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని చెప్పాడు.

తెలుగు ప్రేక్ష‌కులంద‌రికీ సంక్రాంతి శుభాకాంక్ష‌లు. నేను ఎక్క‌డికెళ్లినా చెప్పే మాట తెలుగు ఇండ‌స్ట్రీ అంటే నాకెంతో ఇష్టం. సినిమాకు సంబంధించి చాలా విష‌యాలు నేర్చుకుంది టాలీవుడ్‌లోనే.  నా తొలి ప్రాధాన్య‌త తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కే. నా భార్య సోనాలి తెలుగింటి ఆడ‌ప‌డుచు. నేను కూడా మీ కుంటుంబ‌లో ఒక‌డినని చెప్పుకొచ్చాడు సోనూసూద్‌. తెలుగులో అరుంధ‌తి సినిమాతో స్టార్ విల‌న్ గా పేరు తెచ్చుకున్నాడు సోనూసూద్‌. ఆ త‌ర్వాత ప‌లువురు స్టార్ హీరోల చిత్రాల్లో పోటీ ప‌డి న‌టించారు త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు. 

మ‌రిది కోసం సినిమా సెట్ చేసిన స‌మంత‌..!

తెర‌పైకి నాగార్జున-పూరీ కాంబినేష‌న్‌..?

కీర్తిసురేశ్ లుక్ మ‌హేశ్‌బాబు కోసమేనా..?

ర‌వితేజకు రెమ్యున‌రేష‌న్ ఫార్ములా క‌లిసొచ్చింది..!


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo