శనివారం 05 డిసెంబర్ 2020
Cinema - Oct 22, 2020 , 00:24:44

తుగ్లక్‌ దర్బార్‌ నుండి తప్పుకున్నాను! : అదితీరావు

తుగ్లక్‌ దర్బార్‌ నుండి తప్పుకున్నాను! : అదితీరావు

విజయ్‌సేతుపతి నటిస్తున్న తమిళ చిత్రం ‘తుగ్లక్‌ దర్బార్‌'. ఈ సినిమాలో నాయిక పాత్ర నుంచి తాను తప్పుకున్నానని, ఇందులో నటించడం లేదని తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది కథానాయిక అదితీరావు హైదరి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఈ కరోనా వైరస్‌ మహమ్మరి కారణంగా భారతీయ చలన చిత్ర పరిశ్రమతో సహా ప్రపంచ సినీలోకమే గత 8 నెలలుగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దశల వారిగా పనులు ప్రారంభమవుతున్నాయి.ఇప్పటికే కొన్ని సినిమాలు షూటింగ్స్‌ను మొదలుపెట్టారు. పని లేక నటీనటులు ఎవ్వరూ వేచి వుండకూడదని నేను కోరుకుంటున్నాను. అలాగే నేను ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తిచేయడానికి పూర్తిగా కట్టుబడి వున్నాను. నా వల్ల షూటింగ్‌లు ఆలస్యం కాకూడదనుకుంటున్నాను. అందుకే విజయ్‌సేతుపతితో నటిస్తున్న ‘తుగ్లక్‌ దర్బార్‌' చిత్రం నుంచి తప్పుకున్నాను. ఈ చిత్రం బృందానికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. నా పాత్రలో నటించనున్న రాశీఖన్నాకు ఆల్‌దబెస్ట్‌. త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్‌లో చూస్తాను’ అని తెలిపింది.