శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Jan 18, 2021 , 20:37:50

చిరంజీవిని చూసే అన్నీ నేర్చుకున్నా..ప్రియావారియ‌ర్ హీరో రోహిత్

చిరంజీవిని చూసే అన్నీ నేర్చుకున్నా..ప్రియావారియ‌ర్ హీరో రోహిత్

సోషల్ మీడియా సెన్సేషన్ ప్రియా వారియర్ తొలిసారి ప్రైవేట్ సాంగ్ చేసింది. అదే లడీ లడీ.. ప్రస్తుతం యూ ట్యూబ్ లో ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ పాటతోనే రోహిత్ నందన్ హీరోగా పరిచయం అయ్యాడు. ఈయనతో పాటు వింక్ బ్యూటీ ప్రియా వారియర్ చిందులేసింది. ఇందులో డాన్సులకు రోహిత్ కు మంచి పేరు వస్తుంది. నో ఐడియా ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకంపై యంగ్ హీరో రోహిత్ నంద‌న్, ఇంటర్నెట్ సెన్సేష‌న్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ జంట‌గా రూపొందిన లడీ లడీ పాట అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల‌ నుంచి విశేషాద‌ర‌ణ అందుకుంటుంది. ఈ మాసీ నెంబ‌ర్‌ని ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు శ్రీచ‌ర‌ణ్ పాకాల కంపోజ్ చేశారు. అలానే బిగ్ బాస్ 3 విన్న‌ర్, హ్యాపెనింగ్ సింగర్ రాహుల్ సిప్లీగంజ్ఈ పాట‌ను ఆల‌పించారు. 

ప్ర‌స్తుతం ఈ పాట య్యూటూబ్ తోపాటు ఇత‌ర సంగీత మాధ్య‌మాల ద్వారా శ్రోత‌ల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. ఈ సంద‌ర్భంగా యువ న‌టుడు రోహిత్ నంద‌న్ మాట్లాడుతూ..తాను మెగాస్టార్ చిరంజీవిని ఆద‌ర్శంగా తీసుకుని డాన్స్, న‌ట‌న త‌దిత‌ర సినిమా విభాగాల్లో శిక్ష‌ణ తీసుకున్న‌ట్లుగా తెలిపాడు.  లాక్ డౌన్ స‌మ‌యంలో త‌న స్నేహితుడు శ్రీచ‌ర‌ణ్ పాకాల‌తో క‌లిసి ఈ ల‌డీల‌డీ అనే పాటకు సంబంధించిన కార్య‌చ‌ర‌ణ సిద్ధం చేసి.. ఆ త‌రువాత ఆయ‌న సూచ‌న‌ల నుంచే ఈ ఆల్బ‌మ్ లోకి ఇంట‌ర్నెట్ సెన్షేష‌న్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ ను, ప్ర‌ముఖ సింగ‌ర్ రాహుల్ సిప్లీగంజ్ ను తీసుకున్నామ‌ని రోహిత్ నంద‌న్ అన్నారు. ఈ పాట‌ను ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ ర‌ఘు మాస్ట‌ర్ త‌న డాన్సింగ్ స్కిల్స్ తో, లిరిక్ రైట‌ర్ విస్సాప్ర‌గ‌డ త‌న రైటింగ్ తో మ‌రో లెవెల్ కి తీసుకెళ్లార‌ని, ఈ పాట ద్వారానే ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టార‌ని అన్నాడు. ప్రియా వారియ‌ర్ ఈ పాట‌లో ఆడ‌ట‌మే కాదు పాడ‌టం కూడా జ‌రిగంద‌న్నాడు రోహిత్‌. 

తొలిసారిగా తాను చేసిన ఈ ప్ర‌య‌త్నాన్ని తెలుగు ఆడియెన్స్ విశేషంగా ఆద‌రించ‌డం, యూట్యూబ్ లో ఈ పాట‌కు 2 మిలియ‌న్ పైగా వ్యూస్ రావ‌డం తన‌కు చాలా ఆనందాన్ని ఇచ్చింద‌ని రోహిత్ నంద‌న్ తెలిపారు. తాను త్వ‌ర‌లోనే హీరోగా ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడితో తెలుగు చిత్ర సీమ‌లోకి ఎంట్రీ ఇస్తున్నాన‌ని రోహిత్ చెప్పాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌ త్వ‌ర‌లోనే రాబోతుంది. ఏదేమైనా కూడా నేరుగా హీరోగా కాకుండా ముందుగా ఓ ప్రైవేట్ సాంగ్ చేసి.. అందులో తన డాన్సులు ప్రూవ్ చేసుకుని హీరోగా రావాలనుకుంటున్నాడు రోహిత్.

ఇవి కూడా చ‌ద‌వండి..

‘ఉప్పెన’ వేగాన్ని ఆప‌త‌ర‌మా..!

‘క్రాక్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo