శుక్రవారం 23 అక్టోబర్ 2020
Cinema - Sep 13, 2020 , 19:24:12

ఏ హీరోలు డ్ర‌గ్స్ తీసుకుంటారో తెలుసు: పాయ‌ల్

ఏ హీరోలు డ్ర‌గ్స్ తీసుకుంటారో తెలుసు: పాయ‌ల్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆక‌స్మిక మృతి త‌ర్వాత డ్ర‌గ్స్ లింక్స్ వ్య‌వ‌హారంలో న‌టి రియా చ‌క్ర‌వ‌ర్తిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అధికారుల విచార‌ణ‌లో రియా చక్ర‌వ‌ర్తి ప‌లువురు న‌టీన‌టులు పేర్ల‌ను చెప్పినట్టు వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ న‌టి పాయ‌ల్ ఘోష్ డ్ర‌గ్స్ విష‌య‌మై చిట్ చాట్ లో చెప్పుకొచ్చింది.


అంద‌రు హీరోలు డ్ర‌గ్స్ తీసుకుంటార‌ని నేను చెప్ప‌లేను. హీరోల్లో కొంత‌మంది వారి ఆరోగ్యం ప‌ట్ల మంచి జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. కానీ చాలా మంది యాక్ట‌ర్లు డ్ర‌గ్స్ తీసుకుంటార‌ని నాకు తెలుసు. కొన్ని ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చినా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌చ్చనుకుంటున్నారు. కానీ అలా ఎలా ఉంటారు. మీరు సెల‌బ్రిటీగా ఉన్న‌పుడు స‌మాజానికి రోల్ మోడ‌ల్ గా ఉండాలి. కానీ అలాంటి ప‌నులెలా చేయ‌గ‌లరని ప్ర‌శ్నించింది పాయ‌ల్ రాజ్ పుత్‌.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo